ప్రపంచ తపాల దినోత్సవం**,🪻ఆటవెలదులు, ,🪻

మనకు దూరమున్న మనుషుల క్షేమము
తెలిసి కొనుట నాడు తేలికాయె
ఉత్తరాలు రాసి ఉన్న సమాచార
మందుబాటు కొచ్చె అందరకును !

ఇల్లు యిల్లు దిరిగి యిక్కట్లు బడుకుంటు
ఉత్తరాల నిచ్చు నుత్తముండు
అందుబాటు నుండు నందరి బంధువై
పొగడ దగెడి యతడె,”పోస్టు మేను”

చదువరాని “జాబు”చదివి విషయమంత
వివరముగను జెప్పు విశ్వనరుడు
ఫోను జేసి యిపుడు పోకుండ,రాకుండ
మాటలాడు వసతి మనకు గలిగె !

నాటి కాలమందు నడకయే సాధనం
ఎంత దవ్వునైన నీడ్చు కుంటు
నేటి కాలమందు నాటి తిప్పలు లేక
విషయమంత దెలుపు “వింత ఫోను”!

నాటి కష్టములను నానాట తగ్గించె
బండి మీద నేడు బయలు దేరు
ఉత్తరాల నిచ్చు “ఉత్తమ బంట్రోతు”
కష్టములకు వెరచి కలత పడడు !

వృత్తి ధర్మ మొక్క కత్తిమీద సాము
ఉత్తరాల పంచు ఓపినంత
గుర్తుపట్టిసేవ,గుర్తింపు నిచ్చిన
శ్రమను మరచి తృప్తి జెందగలరు !

                         .......... కోట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *