సాహిత్య,ఆధ్యాత్మిక,కళా,సాంస్కృతిక రంగాల ప్రముఖులకు ఎల్లలు(హద్దులు)వుండవు.
వారు విశ్వమానవులు.
అయితే వారి స్థానికత కూడా తెలుసు కోవాలి.
స్థానికత వారి ప్రాంతీయులకు,ప్రాంతాలకు ఘనత.!వారి మాండలిక భాషా స్థితికి దర్పణం పడుతుంది.అందుకోసమైనా తెలుసు కోవాలి!
🌹ఆతుకూరి మొల్లమ్మ!
🌷🌷🌷
ప్రాచిన కవయిత్రులలో రెండవ మహిళా కవయిత్రి.
ప్రముఖ రామాయణ కవయిత్రి .ప్రథమురాలు తాళ్ళపాక తిమ్మక్క!
నెల్లూరుజిల్లా,రాపూరు పరగణాలలో కలువాయి మండలం గోపవరం గ్రామంలో జన్మించింది.
ఈమె నెల్లూరుజిల్లా వాసి అని చెప్పడానికి అనేక చారిత్రక కారణాలున్నాయి.
మొల్లమ్మ పై నేను పరిశోధన చేశాను.ఆమె స్వస్థల నిర్ణయమూ,కాల నిర్ణయమూ చేశాను.
🌹అల్లసాని పెద్దన
🌷🌷🌷
పెద్దన శ్రీ కృష్ణ దేవరాయల బాల్య సఖుడు,ప్రేమపాత్రుడు.
కర్ణాటక బళ్లారి జిల్లా దూపాడు పరాగణాలకు చెందిన వ్యక్తి.
రాయలు ఇతనికి కడపజిల్లలో
పెద్దనపాడును,కర్నూలు జిల్లాలో ఒకటిరెండు అగ్రహారాలను దానమిచ్చాడు!
🌷
🌹శ్రీనాథుడు!
🌷🌷🌷
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి.తాత కమలనాభామాత్యుడు కృష్ణపట్నం అధీశుడు.కృష్ణపట్నం(ఓడరేవు) పూర్వనామధీయం క్రాళ్పట్టణం!
బాల్యమిత్రుడు నెల్లూరు అవచి తిప్పయ్యశెట్టి.
ఆదరించినవారు నెల్లూరు పరగానాల నుంచిరాష్ట్రం మొత్తానికి వ్యాపించిన పంటరేడ్లు.
🌷
🌹పోతన….బమ్మెర,!
🌷🌷🌷
పోతన వరంగల్లు ప్రాంతపు
బమ్మెర గ్రామస్తుడు.
అక్కడ చారిత్రిక ఆనవాళ్లున్నాయి!
శ్రీనాథుడు కొండవీటిలో వివాహం చేసుకున్నాడు.అతనికి ఇద్దరు బావ మరుదులు.ఇద్దరూకవులే! అందులో ఒకరి పేరు కూడా పోతనే!
ఆ పోతన మన బమ్మెరపోతన కాదు!
ఈ కారణం వల్ల శ్రీనాథ పోతనలు బావమరుదులుగా ప్రచారం జరిగింది!
🌷రామరాజ భూషణుడు!
🌷🌷🌷
ఇతను ప్రతిభాసమన్వితుడైన కవి మరియు సంగీతజ్ఞుడు.
శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియా రామరాయలవద్ద ఆస్థాన కవిగా ఉన్నాడు.ఇతని అసలు పేరు మూర్తి కవి,భట్టుమూర్తి అనికూడా పిలుస్తారు.రామరాయల ఆస్థానంలో భూషణంగా వెలిగాడు కాబట్టి రామ రాజా భూషణు డయ్యాడు. అయితే రాయలు తల్లికోట యుద్ధంలో మరణించిన తర్వాత రాయల తమ్ముడు తిరుమల రాయలవద్ద కూడా ఆస్థాన కవిగా కొనసాగాడు.
ఇతను కడప జిల్లా వాస్తవ్యుడు.
ఇట్లా మన సాహిత్య.చరిత్రలో అనేక మార్పులు చేయవలసి ఉంది.అట్లా చేయకపోతే మనపిల్లలు తప్పుడు చరితే మన చరిత్ర అనుకుంటారు.
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవుల్లో కూడా ఇట్లాంటి పోరబాట్లే జరిగాయి.
ఇవన్ని పండితులు సరిదిద్దాలి.ప్రభుత్వం పూనుకోవాలి!!
🌷
🩷🩷🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878