చెప్పుకోలేని భావాలు తో పాటు, ఈ పదాలు పంపుతున్నాను..
ప్రేమ అనేది అభిప్రాయం కాదు… అది మౌనంగా అర్థం చేసుకునే కళ.. ప్రేమ మాటల్లో కాదు, గమ్మత్తుగా జ్ఞాపకాలు తయారయ్యే ప్రతి చిన్న క్షణంలో ఉంటుంది..
ప్రేమ గురించి చదివినవి అన్నీ… ఇప్పుడు చిన్నగా అనిపిస్తున్నాయి.
ఎందుకంటే ప్రేమ అంటే, బలంగా మాట చెబితే కాదు,
నిజాన్ని మౌనంగా అర్థం చేసుకునే సామర్థ్యం..
ప్రతి నిజమైన ప్రేమ, ముందుగా మనల్ని మనతో పరిచయం చేస్తుంది..
నిన్ను బాధపెట్టిన ప్రతి మాట ఇప్పుడు వాక్యంగా మారిపోవచ్చు…
కానీ నిజమైన ప్రేమ గురించి రాయాలంటే, గాయం నీ శక్తిని తగ్గించిందనే భావం కాకుండా,
అది ప్రేమకి కొత్త అర్థం నేర్పిందనే నిజాన్ని రాసుకోవాలి.
ప్రేమ నన్ను వదిలిపోయిన సందర్భాల్లో కాదు,
నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదని నేనే నన్ను ఒప్పించుకున్న క్షణాల్లో పుట్టింది, గాయం నన్ను మార్చలేదేమో, కానీ
ప్రేమకి ఎన్ని రకాలు ఉన్నాయో అర్థం చెప్పింది..
నన్ను చూసిన చూపుల కన్నా,
నన్ను అర్థం చేసుకున్న ఊపిరే నాకు నచ్చింది.. అదే ప్రేమ అనిపించింది..
నన్ను బాధపెట్టిన ఆ తడి కన్నీటిలో,
ఎవరైనా నా మౌనాన్ని తాకగలరని ఆశించేలా మారినది ప్రేమ…
ప్రేమ అనేది దగ్గరగా ఉన్న గొంతు కాదు,
దూరంగా ఉన్నా, నా మౌనానికి అర్థం చెప్పే ఒక ఊపిరి.
ప్రేమకి నేను విలువ ఇచ్చానని నాకు తెలుసు…
ఆ విలువను గుర్తించగలిగే తనువు వచ్చినప్పుడు
అంతే నమ్మకంగా ఉండాలని నిన్ను సిద్ధం చేస్తున్నాను..
ప్రేమ విలువను నేనెప్పుడో గుండె తడిలో నేర్చుకున్నాను,
ఇప్పుడు ఆ విలువను అర్థం చేసుకునే ఒకరి కోసం ఎదురు చూస్తూ…
నేను నాలోనే ఒక ప్రేమగా మారిపోతున్నాను..
ఒక ముయ్యలేని పుస్తకంలా, రాయలేని కవితలా..
ముగించలేని కథలా, చేరుకోలేని ప్రయాణమే అయిన..
ఇలాగే తను కూడా నన్ను ప్రేమిస్తారనే భావనని
అర్పించగలిగితే, అదే అంతిమ జీవిత సంగీతం.. ❤️🩹
-ప్రేమ