ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం

ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం,,,,,,,,!!

ప్రేమికులిరువురి స్వచ్ఛమైన ప్రేమ
వెన్నెలల్లిన హృదయాల కోవెల
లలిత లలిత లాలిత్య కుసుమ కోమలం హృదయాలు,,,,,,,
నిజమైన ప్రేమ గుభాళించే పూవుల్లా స్వచ్ఛమైనది
ఆ ప్రేమ శారీరక సుఖాన్ని కోరదు
ఇరువురి హృదయాలు వికసించి పరిమళించే కమలంలా పవిత్రమైనది ప్రేమ,,,,,,
శారీరక ఆకర్షణలు, కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల,,,,,,
ప్రేమ హృదయంలో గూడుకట్టుకున్న మధురమైన స్వప్నాల కళానిలయం,,,,,,,,
కొన్ని విషయాల పట్ల ఆకర్షణ త్యజిస్తేనే ప్రేమ అమృతం కురుస్తుంది,,,,,,,,,,
హృదయంలో పన్నీటి జీవజలములు పారే సెలయేరు ప్రేమ,,,,,,,,,,
హృదయంలో దివిలోని పారిజాతం పుష్పించి గుభాళించే మధురమైన భావన ప్రేమంటే,,,,,,,,,
హృదయంలో కృష్ణవేణి తరంగాలలో సాగే మురళీరవం ప్రేమ,,,,,,,,,,
హృదయంలో వీణుల కింపుగా కోయిలతీసే రాగం తేనీయలు ప్రేమంటే,,,,,,,,,
సముద్రమంత లోతైన హృదయాలలో వీచే మలయమారుతాలలో ఎగిరే పక్షుల జంటల ఊసులు పక్వమైన ప్రేమ,,,,,,,,,,,
ప్రేమ ఎప్పుడూ ఓటమి ఎరుగదు భువి నుండి దివిదాకా హృదయాలు పాడే సుమధుర గీతాంజలి,,,,,,,,,,
ఆలోచనలకు అందని రూపంలో హృదయంలో నెలవైనది సిసలైన ప్రేమ,,,,,,,,,
అందుకే నిజమైన ప్రేమ పెళ్ళికి చిరునామా కాదు,,,,,,

అపరాజిత్
సూర్యాపేట
ఈ కవిత నా కలం సేత అని నా హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *