ప్రేమలేఖ

నా ప్రియాతి ప్రియమైన నీకు నేనే అంటే అచ్చంగా నేనే రాస్తున్న ప్రేమలేఖ ఇది..
నేనెవరో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది ఇంత వరకు కళ్లు కలుసు కోవడమే కానీ మనం కలవ లేదు మనసు మాట్లాడు కోవడమే కానీ మనం మాట్లాడు కోలేదు..
కళ్లూ మనసు మాట్లాడుకుంటుంటే మధురమైన భావన కలిగి పెదవులు నవ్వుకున్నాయి తెలుసా? నా పెదవులే కాదు నీ పెదవులు కూడా నవ్వాయి నేను చూసాను లే!
నా దగ్గర దాచాలని చూడకు నువ్వు చూసే ఆ చూపులో నాకెన్నో విషయాలు తెలిసి పోతుంటాయి మరి నీకేం తెలియడం లేదా?
నాకో గులాబీ ఇచ్చి చెప్పొచ్చు కదా!
నీ ప్రేమను నీ లోనే దాచుకుంటే ఎలా? నాతో పంచుకోవాలి కదా!
నువ్వెలాగూ ధైర్యం చేయడం లేదు అందుకే నేనైనా ఈ లేఖ ద్వారా అంద చేస్తున్న నా ప్రేమను దీన్ని అందుకున్నాకనైనా నీ ప్రేమను తెలియ పరుచు…
ఉంటామరి…

                  నీ లేఖ కోసం ఎదురు చూసే నీ ప్రేయసి...


         ఉమాదేవి ఎర్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *