ప్రేమించు ప్రేమించబడు
ప్రేమ హృదయాంతరాళం నుండి పొంగే ఇరుశ్వాసల లయం
ఆకాశంలో విహరించే పావురాల జంటల గోరువెచ్చని ఊసులు ,బాసలు ప్రేమానుభూతుల స్పర్శలు,,,,,,,,,,
షాజహాన్ తన ప్రాణేశ్వరి ముంతాజ్ అపురూప సౌందర్యరాశి ప్రేమరూపసి దూరమైతే కుమిలి కుమిలి ఆమె కోసం భువిపై ఇంతటి చిరస్మరణీయమైన అద్భుత ప్రేమాలయం ఇకపై ఏ మానవమాత్రుడు నిర్మించలేడు కదా,,,,,,,,,,
పౌర్ణమి చంద్రుడి వెన్నెల విరబూసినట్లు ఈ తాజ్ లో ప్రేమామృత ధారలు ఆకర్షణీయమైన కళారూపాన్ని వీక్షించే హృదయలలో అతిస్వచ్చమైన ప్రేమలు ప్రతిధ్వనిస్తాయి,,,,,,,,,,
ప్రేమలు అంతరించిపోతూ ఆకర్షణలు,అభూతకల్పనల్లో ప్రేమలేల ! ?!
ఎంతటి కఠిన హృదయాలైనా కరిగినీరై ప్రేమలు పుష్పించి ఫలియించును దర్శించినంతనే,,,,,,,,,,
నీ హృదయంలో ప్రేమాంకురించి మొక్కయి వృక్షమై పుష్పించి ఫలియించును వీక్షణలోనే,,,,,,,,,
ఈ భరత ఖండాన్ని ప్రేమగోపురంగా తీర్చిదిద్దిన శిల్పులు, కళాకారులు, శ్రామికులు షాజహాన్ హృదయంలోని ప్రేమామృతం శాశ్వత కలల కళారూపంగా వెలసిన తాజ్ ,,,,,,,,,,,,
ప్రపంచ వింతగా ఎల్లకాలం నిలిచే వజ్రతుల్య ప్రేమాలయం,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట