ప్రేమ లేఖల పోటీ..కొరకు
పేరు:కళ
నాకూ ప్రియాతిప్రియమైన మీకూ పంపుతున్న ఈ లేఖ.. మీకూ ఏమి కానీ బంధం పెనవిసుకున్న నేను..
ఇంత కాలానికి మళ్ళీ మీకూ లేఖ రాస్తున్నా.. బహుశా ఇదే నా చివరి లేఖ.. మనసున మరుగున పడిన జ్ఞాపకాల తోలి లేఖ..
కుశల ప్రశ్నలు అడగలేను… నిన్నూ చూడాలి అనీ ఆశ.. అది కూడా దూరం నుండే సుమ..
ఎందుకో తెలుసా సాగిపోయినా కాలంలో చివరి మజిలీ మన బంధం ఎపుడో దాటివేసింది…
నా నయనం నిన్నూ చూడాలి ఎంతలా అంటే కన్నీటి వర్షం సైతం లెక్కచేయకుండా.. అదే సమయంలో నా ఉనికి నీకూ తెలియకూడదు…
మొహమాటం, భయం, బిడియం నా మనసుకు పడిన సంకెళ్లు తద్వారా నా గొంతు మూగబోయింది..
కానీ ఇప్పుడు అన్ని దాటి గట్టిగా చెప్పాలి అనీ ఉంది… నువ్వంటే నాకూ ఇష్టం… ఎంతలా అంటే నన్ను నేను మరిచేంతలా..
బంగారం అనే నీ ఒక్కసారి పిలుపు కై పరితపించాను.. నాడు..
అదే బంగారం అనే పిలుపు యాద్రుచ్చికంగా నేడు వినపడిన నా మదిలో కలవరం.. ఎంతల అంటే జీవితమే కల్లోలం అయ్యేలా..
నీ నుండి కాస్త అయినా ప్రేమ ఇక ఎప్పటికి ఆశించలేని ప్రియురాలు నీ.. క్షమించు మరొక ఇంటి ఇల్లాలి నీ..
ప్రతి సారి లాగే ఈ సారి కూడా ఈ.. నా ప్రేమలేఖ గమ్యస్థానం అయ్యింది నా ఇంటి చెత్త బుట్ట…
బహుశా ఈ జన్మ కూ నా ప్రేమలేఖ నీ చెంతకు చేరలేదు ఏమో..
మదిలో నిక్షిప్తమైన ఈ ప్రేమకు మరు జన్మ కూ అయినా స్వేచ్చ దొరికేనా… నిన్నూ చేరేనా..
మరు జన్మకయినా నా నిరీక్షణ ఫలించేనా…
నాకే నా ఈ భావన నీకూ లేదా…?
ఏమో అసలు నీకూ గురుతు ఉన్నానో లేదో..?
నిశిధిలో మెల్లగా అలుముకుంటున్నాయి నీ జ్ఞాపకాల నీలి మేఘాలు నిద్రే రాకుండా…
ఎట్టకేలకు భారమైన కన్నీటితో నా కళ్ళు ఉపక్రమిస్తున్నాయి నిద్రాదేవి సాన్నిహిత్యంలో..
నా సొంత రచన అనీ హామీ ఇస్తున్నాను…