కథనం
అంశం : నా మనస్సు తీసే భావాలు,,,,,
శీర్షిక : ప్రేమ స్మృతులు,,,,,,!
పేరు : అపరాజిత్ రెడ్డి
హామీ పత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ.
నలుపు తెలుపు రంగుల విచిత్రం మన సహవాసం,,,,,,
ఒకప్పుడు లంగా వోనీతో కళకళలాడే సౌందర్యం నీది,,,,,
ఆ రోజుల్లో నేను పంచె నల్లని కోటుతో బి ఏ గ్రాడ్యువేషన్ చదువుతున్నాను,,,,,,,
నీవు అదే కళాశాల విద్యార్థినివి సైకిల్ తొక్కుకుంటూ వచ్చేదానివి,,,,,,,
ఒకరోజు నేను కాలినడకన కళాశాలకు వస్తుండగా నా చేరువలోనే నీ సైకిల్ స్లిప్ అవ్వుతూ తడబడుతున్నావు,,,,,,
సైకిల్ చక్రంలో నీ కాలి పట్టాగొలుసు ఇరుక్కుపోయి బిత్తరచూపులు చూస్తున్నావు,,,,,,
నేను వెంటనే నెమ్మదిగా ఆ కాలి పట్టాగొలుసును తీశాను నీ కళ్ళు మెరుస్తూ నాపై ఏదో అనిర్వచనీయమైన ఆరాధనతో కృతజ్ఞతలు తెలిపావు,,,,,,,
యవ్వనంలో ఉన్న మనం మన తొలి పరిచయం స్నేహంగా మారింది,,,,,,,
అనతికాలంలోనే అది ప్రేమగా వెల్లివిరిసింది,,,,,,
ఆ యవ్వనంలో పూవుల మకరందాల సోయగాలన్నీ నీలో అగుపించాయ్,,,,,,,,
నీవు కలిసినప్పుడల్లా హరివిల్లు అందాల దివిసీమలో విహరించినట్లు తీయతీయని కబుర్ల ఊసులతో బాసలెన్నో చేసుకున్నాం,,,,,,,,
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా ,,,,,,,,,
మీ అమ్మానాన్నలు మన ప్రేమ విషయం తెలిసి మీ హోదా అంతస్తుకు దగ్గ వరునితో పెళ్ళి చేసి పట్నం పంపించారు,,,,,,,
నేను పగిలిన గుండెలతో చదువులు కోనసాగిస్తూ,,,,,,,
నిశీధి చట్రంలో నలుపు తెలుపు రంగుల చిత్రాన్నయి గుమస్తాగా నేను నా పెళ్ళాం పిల్లలు,,,,,,!
మనం కలుసుకోలేని తూర్పు పడమరలం,,,,,,
నీవు కారుల్లో తిరిగే కోఠీశ్వరురాలివి నేను సైకిల్ తొక్కే నిరుపేదను,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట