ప్రేమ

ప్రేమ

రెండు హృదయాల నుండి ఉబికివచ్చే కళ్ళు పలికే మౌన కళా జలపాతం
రాగ రంజిత వికసించిన ప్రేమ కుసుమాల హృదయాల మూగ భాష్యం
ఎదురుగా లేని సమయంలో హృదయాలు కోసే మూగ బాధ
హృదయమనే అగ్నిపర్వతం లోంచి ఉబికివచ్చే ప్రేమధారలో కళ్ళ కలయిక మూగ ఆరాధన
హృదయాలు కళ్ళల్లో పలికే సుకుమార సౌందర్య పిపాస మురళీ గీతం
యవ్వన వసంత పున్నమిలో హృదయాలు పాడే సొగసు పూలమాలల సన్నాయి రాగం
సొగసు పూసిన చిన్నదాని హృదయం అనురాగాల వెన్నెలలో తేనేపట్టు రాగాలు కళ్ళు పూసిన కళాఖండం మోము
ఆకుపచ్చని చీరలో వన్నెలారబోసుకుంటున్న ప్రకృతి కన్యకలా జీవనం సౌందర్యం ఆరాధ్యం ఆకర్షణీయమైన ఆలంబనలో ప్రేమానురాగంలో హృదయం
విరబూసిన మరుమల్లియలు జడలో తురుముకుని వలపు వసంతాల పరిమళాలలో తేలిపోయే సుందరి కలల మూగ కళ్ళ హృదయం తెల్లకాగితం
కవి రాసిన విరహగీతం యువతి గళం గాన గంధర్వంలో ఉయలలూగుతూ శ్రోతల హృదయాలను పిండివేస్తూ సొగసైన స్వాతిచినుకులు ఆహుతుల్లో కురుస్తున్న అనుభూతి
మనస్సు రంగరించి హృదయంలో పోసి అనంత ప్రభాకరుని అద్భుత నవోదయం పాడే ప్రభాతగీతంలో ఓలలాడే హృదయాల పెనవేత పెనుగాయాల ఓదార్పు
వెండికొండలపై పాలు గుమ్మరించినట్లు మంచుపూవులు జారుతూ తెల్లని చీరలో వయ్యారి చెలికాని హృదయంలో పారుతున్న హిమానీనదం
ఊహల్లో ఊగుతున్నట్లు మదినిండా తానై జీవితం గాయాల వ్రణమై కలల కళ్ళు తెరిస్తే ముళ్ళు పూవులై సాగిపోయే బహుదూరపు బాటసారిని నీ సహచరుణ్ణి

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *