ప్రైవేటు ఉపాధ్యాయులు వారి బాధలు

ప్రైవేటు ఉపాధ్యాయులంటే అక్షరాల తాడుతో గొంతు నులిమేసినట్లే,,,,,,,,,
పొద్దస్తమానం చేసే బోధనల్లో గుండె గొంతుకలో పూడుకుపోయి ,ముఖం వాడిపోయిన నల్లగులాబీ,,,,,,,,, ప్రతినిత్యం ఏడు పిరియడ్లు బోధన భరించలేని కంఠశోష అయినా తప్పదు జీవితరథం సాగడానికి,,,,,,,,,,,,,
తమ మెదడు ,గొంతు,ఉఛ్వాస నిశ్వాసల ఊపిరులు దారపోసి పిల్లల భవిష్యత్తుకు వెలుగుల బాటలువేసే మూలస్థంబాలు ,దిక్సూచిలు,,,,,,,
ఉపాధ్యాయులంటే గౌరవం కోల్పోయిన సామాజంలో నివసించే అజ్ఞాత మేధావులు,,,,,,,,,
ప్రైవేటు ఉపాధ్యాయుల వైవిధ్య శ్రమలకు చెల్లించే అతితక్కువ జీతంరాళ్ళ తమ ఇల్లు గడవడమంటే కష్టాల ఎదురీత,,,,,,,,,,,
చదువుకున్న డిగ్రీలు ఏవైనా ఉపాధ్యాయులను సేవకులుగా చూస్తూ అజమాయిషీ చేయడం నిత్యం గుండెల్లో గుణపాలు గుచ్చుకునేలా యాజమాన్యం గర్వంతో చేసే అవమానాలు,చీటికిమాటికి వేసే వెర్రికేకల్లో జీవితాలు అభాసుపాలు,,,,,,,,,,,,
విద్యాసంస్థలకు ఎన్నెన్నో లాభాలు, సమాజంలో గుర్తింపు తెచ్చిపెట్టే ప్రైవేటు బ్రతుకుల శ్రమ గోడకేసిన సున్నంలా వృధా ప్రయాస,,,,,,,,,,
విద్యార్థులను విజ్ఞాన ఘనులు చేసిన తమ జీవిత పుటల్లో అన్నీ రక్తాక్షరాలే,,,,,,,,,,
వెలకట్టలేని జ్ఞానం అందించే ప్రైవేటు ఉపాధ్యాయులు కూలీల్లా చూసే యాజమాన్యం కేర్ ఆఫ్ ఫ్లాట్ ఫామ్ నుంచి వచ్చిన ఈ నికృష్టులకు చదువులు విజ్ఞానం విలువ తెలియని మూర్ఖులు,,,,,,,,,
లక్షలకు లక్షలు లాభాలు ఆర్జించిపెట్టే ఉపాధ్యాయులను చిన్నచూపు చూస్తూ అరకొర జీతాలు చెల్లించే ప్రైవేటు విద్యావ్యవస్థల మెదళ్ళు బూజుపట్టిన దయ్యాల గుహలు,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *