బంగరు రూపసులు బంతులు,ఇంతులు,,,,,,,,,!!

బంతులు చేమంతులు ముద్దబంతులు రిక్కబంతులు
పసుపు కుంకుమ కలిపిన రంగులో స్వచ్చదనం నిండుతనం నింపుకున్న కంచుకాగడాలో వెలిగే జ్వాలా తరంగిణి రూపం ఈ బంతిపూవు,,,,,,,,,,,,,,
కోమల భాష్యాల భగవాన్ తన హృదయంతో సృజయించిన ప్రేమ రంగరించిపోసిన ఆత్మ కాబోలు మహిళా మణుల మనసైన పుష్పం గుప్పుమనే బంతిపూవు,,,,,,,,,,,
నిర్మల నిశ్ఛల గౌరీపుత్రికలా తీర్చిదిద్దుకున్న ఇల్లాలి మౌని ముఖం పసుపు కుంకుమల కలబోసి రంగరించిన రూపం అరుదైన ముద్దబంతిపూవు ప్రియుని బ్రోలు,,,,,,,,,,
ఎన్నెన్నో అందాల రాశివై స్వేచ్ఛగా తల ఊపుతూ ముక్కు పుటాలదిరే గుంభన సుగంధాల పుప్పొడి వేదజల్లుతూ ఇహలోక సౌందర్య శిఖామణివై తేనెలూరు బంతివి ముద్దబంతివి,,,,,,,,,,,,
పూవుల మద్య ముదితల శిరోజాల మధ్య పేరెన్నికగన్న సుకుమారి బంతివి బంగారు మనోరంజనివి సంజీవని పుష్పానివి కలల రాణివి ,,,,,,,,,,,,,,,,,,
అక్షరాల అల్లికయే కావ్యమై మేల్కొలుపు ముద్దబంతులన్నీ మాలలల్లి భగవాన్ మెడలో వేసి ఆరాధిస్తే జీవితం సాఫల్యమవును భక్తిలో ముక్తిలో,,,,,,,,,,,,,
బంతులను ఆరాధించు ఇంద్రధనుస్సు రంగుల తుమ్మెదలు మకరందాల మన్మధ మత్తుకోసం తపిస్తూ హృదయం నిండుగా గ్రోలి తన్మయత్వంలో కళ్ళు మత్తుగా గమ్మత్తుగా నిషానింపుకుని జుంకారంతో తూలుతూ బంతిపూవుల సుగంధాల్లో మరులుగొని ఆకర్షణలో ప్రేమలో సోలిపోయే తుమ్మెదలు జాలిగొలుపు ఇంద్రులు సురేంద్రులు,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *