డబ్బు ఉంటుంది
ఆకలి తీరదు….
ఆదాయం వుంటుంది
ఆనందం
కనిపించదు,దరిచేరదు….
అన్నీ ఉంటాయి
ఇరువురిమధ్య
ఆత్మీయత వుండదు….
తిండి,నీడ సరిపడావుంటే చాలు
బంధం
పెనవేసుక ఉంటే…….!
పూరిగుడిసెలో
పచ్చడి మెతుకులు తిన్నాచాలు
బంధం
అనుబంధంగా
కౌగిలించుకుంటే……!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి