బడిపంతులు ఆవేదన
మలి సంధ్య వేళ
రివ్వున వీచే పిల్లగాలుల్లో
కోడేనాగులా దూసుకెళ్తున్న
కాలువ పక్కన ఏకాంతంగా
నేను నేనుగాని అశాంతిలో
రివ్వున రివరివ మంటున్న
విషాద ఛాయల జ్ఞాపకాలు
ఒరలోంచి ఖడ్గం తీసి
నా కంఠాన్ని ఖండించేవిగా
దూరంగా కొండల్లో గుడ్లగూబ కూస్తోంది
నేను కన్న కలలు కన్నీటి సిరాచుక్కలై రాలిపడుతూ
అక్షరాల కాగితాలన్నీ వాడిపోయిన పూవులై
భారమైన బడిపంతులు ఉద్యోగం
ఒకప్పుడు ఈ చేతులతో అక్షరాలు నేర్చిన పిల్లలు
వినయ విధేయతలకు గీటురాళ్లు
కాలం మారింది పిల్లలిపుడు కొరకరాని కొయ్యలు
ఏదో చెప్పాలనే తపన తొలిచేస్తుంటే
ఈ పిల్లలు నా కంఠాన్ని తెగ్గోసుకున్నా పెడచెవిన పెడుతున్న చందం,,,,,,
ఏం చదువులు అయ్యాయి!?!
తెగి ఎక్కడో పడుతున్నా గాలిపటాలు నేర్వగాలేని సంస్కార హీనులు పిల్లలు ,,,,,,,,,,,
ఈ కాలువ గట్టున ఆలోచనలకు అదుపులేదు,,,,,
నా బాధాతప్త మూహాన్ని కాలువ నీటిలో కడుక్కుని
ఈ రిటైర్మెంట్ వయస్సులో ఏమీ చేయలేని దుస్థితి
నా అక్షరాలన్నీ నామీదే గుమ్మరించుకున్నట్లు
గుంపులో గోవిందయ్య నవుతుంటే
ఓపికలు చచ్చిన వయస్సు మీదపడుతూ
భవిష్యత్తరాలను ఉహించుకుంటేనే భయమేస్తోంది,,,,,,,
పొద్దుకుంగుతుంటే తదేకంగా చూస్తో నిష్క్రమిస్తున్నా అక్కడినుండి,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట