తల్లిదండ్రులు నేర్పిన గుణపాఠాలు,,,,,
ఏమిటికీ కొరగాని చదువులు
బ్రతుక నేర్పని చదువులెందుకు!?
ఓనమాలు దిద్ది ఏం చేస్తావురా బిడ్డా,,,,!
దేశం నిండా గొప్ప గొప్ప చదువులు చదివి
ఏ కొలువులు లేక ఊడిగాలు చేసేందుకు వెనుకాడట్లేదు
నాయకుల జండాలు మోస్తూ
కాసిన్ని డబ్బులు చేతిలో అగుపడితే
బలాదూర్ తిరుగుళ్ళ పోకిరీలు
నీవు చదుకుని ఏం సాధిస్తావురా బిడ్డా,,,,,
అంటూ పసితనం హృదయంలో
రొట్టెలు కాల్చే పెంకపై వేగే రొట్టెలా పసితనం
వేగి వేగి కన్నీళ్ల పర్యంతమై
అక్షరాలు దిద్దే చేతివేళ్ళు
నీళ్ళ బిందెలు మోస్తూ
తల్లిదండ్రులు కుదిర్చిన పనమ్మాయివి
అయ్యావా తల్లీ ఈ గజిబిజి జీవిత పోరాటంలో
నిన్ను నిన్నుగా తీర్చిదిద్దే చదువులు
అక్షరాల పూదోటలో ఆటపాటలతో
చదువుల కళామతల్లికి దూరంగా
వాడిపోయిన ముఖంతో వడలిపోయిన శరీరంతో
పసితనంలోనే శ్రమల జీవితం మొదలెట్టావా నాన్నా
ఏ బుద్దీలేని తల్లిదండ్రులు నీపట్ల
యమకింకరులై చాకిరీకి మళ్లించారా పసికూన
ఇప్పుడు పోయిందేమీ లేదు
బాలబాలికలకు చదువు జన్మహక్కు
దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులకు వాకబు చేయి
చదువుకునేందుకు గురుకులాలు హాష్టల్ వసతుల పాఠాశాలలున్నాయి
నిన్ను వాటిల్లో చేర్పించి నీ భవిష్యత్తుకు పునాదులు వేస్తారు
లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయి
నీ చేతివేళ్ళతో అక్షరాల పూవులు పూయించాలిరా కన్నా,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట