బస్సు ప్రమాదంలో మీరుంటే

అక్షర కొరకు
అంశం – బస్సు ప్రమాదంలో మీరుంటే
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – క్షణం లో ప్రమాదం

బస్సు జర్నీ అంటే
నాకెంతో ఇష్టం బస్సు
ఎక్కగానే కిటికీ సీటు
చూసుకుని కూచోవడమే!

ఒకవేళ రిజర్వేషనైనా
కిటికీ సీటే చేసుకోవడం
అలవాటు అది ఎసి బస్సైనా
సరే అదో తృప్తంతే!

ఎక్కగానే ఫోన్ తీసి పాటలు
వినడం వింటూ వింటూ నిద్ర
లోకి జారడం ఆ రోజు అలాగే
ఎక్కాను నిద్రలోకి జారాను!

సడన్ గా అరుపులు ఏవో
మీద పడుతున్నట్టు ఏమీ
అర్థం కాకముందే కొందరి
ప్రాణాలు గాల్లోకెళ్లాయి!

నాకు మాత్రం ఏవో కొన్ని
దెబ్బలే తగిలాయి ఆ దిగ్బ్రాంతి
నుండి తేరుకుని నాకు తోచిన సాయం
చేస్తున్నా దెబ్బలు బాగా తాకిన వారికి
ధైర్యం చెప్తున్నా!

ఫోన్లు చేసి సహాయానికి రప్పిస్తున్నా
దగ్గర ఉన్న హాస్పిటల్ కు పంపుతున్నా
ఇంకేం చేయాలో తోచడం లేదు
అందరు బాధితులను చూస్తూ కన్నీళ్లు
ఆగడం లేదు!

ఇది నా స్వంత రచనఅని హామీ ఇస్తున్నా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *