భ్రమల బ్రతుకు చేదు నిజాలు
ఉషోదయం సూరీడు సింధూర పూవులా అందంగా మిరుమిట్లు గొల్పుతున్నాడు,,,,,,,,,
అయ్యో,,,,!ఆ తూరుపు కొండల స్థానే అతలాకుతలం అవుతున్న సముద్రమేమిటి,,,,! ఇది కలయా నిజమా,,,,!
ఒకవేళ ప్రళయం దాపురించలేదు కదా,,,,! ఈ వేకువనే సమస్తం ఆ కెరటాలలో కొట్టుకుపోవట్లేదు కదా,,,,,!
అంధకారం నుండి వెలుగులోకి ఏతెంచే ఉదయ సంధ్య నా హృదయం లోగిలి నుండి కళ్ళు కన్నీళ్ళ పర్యంతమవుతున్న నా దృష్టి లోపమే,,,,,,,,
ఈ నా దుఃఖంలో ఎండమావులు ఈ చలి వేకువ జామున కూడా నా కళ్ళల్లో నాగజెముడు పూవులు అగుపిస్తున్నట్లు భ్రమలు, ఈ భారమైన బ్రతుకు దీనావస్థలో హిమాం పూవులు గుండెల్లో అగ్నికీలలవుతూ కాలం గతించిపోతోంది,,,,,,,,,
ఈ జీవిత పోరాటం ఇక్కడితో ఆగిపోతే బావుణ్ణు,నిట్టనిలువునా దహించుకుపోతూ ఈ భ్రమలు, చలింపజేసే హృదయ ఘోషలు ఇంకెన్నాళ్ళు,,,,,,,!!
ఉగ్ర పడగలు విప్పుకుంటూ కాలనాగు బుసలు కొడుతూ చీలిక నాలుక సురకత్తిలా నూరుకుంటూ కాటేసేందుకు వెంబడిస్తుంటే కళ్ళు బైర్లు కమ్మి ఏ ఊబిలోనో కూరుకుపోయి గతించిపోతుంటే నీవు నన్ను రక్షించలేని ఆశక్తునివి,,,,,,,,
ఏ ఆనందమూ లేని జీవితానికి దుఃఖితున్నై రాసిన అక్షరాలు చదివేవాళ్ళు కూడా లేక, నేనొకడు ఉన్నాడన్న సోయిలేని బిజీబిజీ లోకం. పోయినా ,ఆ పోయాడులే అనుకుంటూ తమ శ్రమల చాకిరీకి సిద్ధం,ఈ ప్రపంచంలో ఒక్కొక్కడినీ హతం చేయడానికి నా శరీరానికి అణ్వాయుధం అమార్చుకుని మానవబాంబునై పోతా,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట