మంచు కురిసే మనస్సు
చెలీ బయట మంచు కురుస్తోంది చూడు,,,,,,,,
మనం పలుకలేని భావాలేవో ఆ మంచు పొగలో అగుపిస్తున్నాయి కదా,,,,,,,,,,
ఈ మంచు బిందువులు మానవుల బంధాలు అనుబంధాలు కరిగి నీరయ్యే కనుపాపలు పాడే విషాద గీతాలే కదా,,,,,,,,,,
అవును ప్రియా ఈ మంచు పూవులు ,తుషార బిందువులు జీవనయాత్ర పర్యంతం పాడే గుబులు గీతాలు కళ్ళల్లోని అనుభవాల గూళ్ళు చూడలేనివి, వినలేనివి,,,,,,,,,
ఆ యవ్వనంలోని సౌందర్యం ధ్రువప్రాంతాల్లో మంచు మనుష్యుల్లా నీరెండలో కరిగిపోతున్న మంచులా జీవితంలోంచి కదలిపోతున్న చీకటి నీడలు ,,,,,,,,,,,,,
ఈ తెల్లవారుజామున చలి గాలులలో రాత్రి వేళ మనస్సు తీసిన స్వప్నాల లయలు కలిసిపోతూ పైకెగసిపోతూ నిష్క్రమిస్తున్నాయి,,,,,,,,,
ఈ ఉదయం ఓ మనిషన్నవాడిని భావనాతీత దివ్యలోకాల్లోకి తీసుకెళ్లింది ప్రియా,,,,,,,,,
ఈ వయస్సులో గతించిన నీలినీడలు నెమరువేస్తూ కాక ,ఊహల ఊయలలో తేలియాడుతూ జీవన సోయగాలలో నవ్య ఉషస్సులు చవిచూడాలి రా,,,,,,,,,,
వయస్సుతో పనిలేకుండా మంచి సాహిత్యమున్న గీతాలను వింటూనో ,చదువుతూనో ,రాస్తూనో గడపితే గతించిపోయిన గందరగోళం ఆలోచనలు జ్ఞాపకంలోకి రావు,,,,,,,,,,
మనస్సు మంచు ముద్దయై కరిగిపోతున్న ఆలోచనలను అద్దం మీదపడ్డ మంచు బిందువులు జారిపోయిన చందం, తామరాకును నీటి బిందువులు అంటనట్లుగా జీవితం సాగిపోవాలి అదేపనిగా కుమిలిపోయే ఆలోచనలు మననుంచి వీడిపోవాలి,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట