మకరందాలు గ్రోలే గండు తుమ్మెద,,,,!
ఈ అందాల ఆనందాల వెల్లువలో
నీ మోము సుకుమార సౌందర్య రూపసివో,,,,,,
తూర్పు సంధ్యాకాంతుల్లో పసుపు వర్ణం కన్నె పుష్పానివో,,,,,
నీ నగుమోము సౌందర్యం చుట్టూ ప్రదక్షిణలు చేసే తుమ్మెద ఝుంకారాలు,,,,,,,,,
ఈ పగళ్ళు ఈ రాత్రులు ఈ పూవులు ఈ వెన్నెలలు ఈ నునువెచ్చని సూర్యకాంతి
ఇవన్నీ నింపుకున్న అందాల సుందరీమణి పసుపు రంగు పులుముకున్న బంతిదా చేమంతిదా నీ మోము,,,,,,
ఈ పగలు విరిసిన పసుపుపచ్చని నక్షత్రం కురిపించే మకరందాలు నీ మౌని మోము,,,,,,,
నీ జతగా తిరుగాడే తుమ్మెద కళ్ళు తెరిచి నీ నిండైన హృదయం తేనె సముద్రం ఆస్వాదించడానికి ఈ తనువు చాలదు,,,,,
అందుకే తుమ్మెదలన్నీ పాడుతున్నాయి ఏ గీత గీసినా నీ రూపమే ఏ చిత్రం వేసినా నీ రూపమే రంగవల్లి రచనా పూజితవో పసుపుపచ్చని చేమంతిబాల,,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట