మనసు పలికే పాట

అక్షర కొరకు
అంశం :⁠- యుగళ గీతం
తేది:⁠- 27/11/2025
శీర్షిక:⁠- మనసు పలికే పాట…

మనసు పలికే పాట, మౌనం చెప్పే మాట
నీలోనే నిలిచేటి నా జీవితపు బాట
తెల్లారే వేళలో తెమ్మెర వీచే వేళ
నీ తలపుల గుమ్మంలో నిలబడిపోనా…
నీ నవ్వుల గంట నా గుండె లయను కదిపేను
ఆ లయకే శృతి కలిపి పాట పాడనా…

చరణం: 1

ఆకాశం నీలమై అలలు తీరం తాకి
ప్రతి పువ్వు సువాసన నిన్నే చూపి
ప్రతి అణువులో నీదే పలకరింపు ఉందీ
నా ప్రతి కదలిక నీ ప్రేమకే బంధీ...

మనసు పలికే పాట, మౌనం చెప్పే మాట
నీలోనే నిలిచేటి నా జీవితపు బాట...

చరణం: 2
గతమంతా మాయమై రేపంతా ఆశై
నీ చేతిలో చేయి వేసి సాగనా దూరమై…
సూర్యుడు నిదరించినా, నక్షత్రం వెలిగినా
నా కళ్ళ ముందు నీ రూపం శాశ్వతంగా నిలవనా…

మనసు పలికే పాట, మౌనం చెప్పే మాట
నీలోనే నిలిచేటి నా జీవితపు బాట

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ పాట నా సొంతం అని హామీ ఇస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *