మనసు మూగబోయింది

మనసు ఎందుకో మూగ బోయింది. శరీరం ఎందుకో సహకరించనంటుంది
ఏదో గుబులు గా ఉంది
ఎందుకో దిగులు దాస్తుంది
ఏదో భయం అవహించింది
ఏదో పోగొట్టుకున్న బాధ
ఏదో కోల్పోతున్న అనుభూతి
ఎందుకిలా అంటే మనసు చంచలమా, చిత్త చాపల్యమా, విభ్రాంతియా, విరక్తియా, ఆవేదనా? ఆందోళనా?
ఏదో ఏదో ఇంకేదో మరేదో…. అర్థం లేనిదా? అవమానమా? అనుమానమా?
సమాధానం లేనిదా?
జవాబులు తెలియని ప్రశ్నలు?
ఆలోచిస్తున్న అంతుచిక్కని ఆరాటాలు? ఎందుకో మనసు మూగబోయింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *