మనస్సులో మంచు
ఈ పొగమంచు ఆఖరి చుక్క కురిసేదాకా
మనిషీ ఈ కాలిదారిన నడుస్తూ వెళ్ళే దూరాలు ఎందాక ?
గుండెల్లోంచి వెచ్చని రక్తం ప్రసరిస్తున్నా ఒళ్ళు గగుర్పొడిచే చలి,,,,,
ఈ మంచులో మనస్సు పొరలు విచ్చుకుని ఆలోచనలలో నిన్ను నీవు మరచిపోయావు,,,,,,
ఈ చెట్టూచేమ కొండకోన రాయిరప్పలన్నీ చలితో నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నాయి
రెండు పాదాలే కురిసే మంచులో ఆయుధాలు ఎముకలు కొరికే చలితో యుద్ధం చేయడానికి,,,,,
హిమం కురిసే ప్రభాత వేళ ఎవరూ అగుపించని పొగలో ఒంటరి నడక ఆనవాళ్లు దొరకని తీరాలకు,,,,,
ఒంట్లోని రక్తం మందమవుతూ చలిగాలులలో గడ్డకడుతూ కన్నీటి చుక్కలు చెక్కిలిపై రాలుతూ వీడ్కోలు సంకేతం చూపిస్తూ,,,,,
మనిషి యాతనలు ,వేదనలు అక్షరీకరించలేని వడలుతో కూడుకున్న మనస్సు అనే కపాలంగూడు నిండా రక్తపుటేరుల ఆలోచనలు,,,,
మనిషి యుద్ధం తన మనస్సుతోనే
అపరాజిత్
సూర్యాపేట