మనస్సు మర్మం,,,,,,,,,,!!

నా మనసు విరితేనీయల
భావాల తరంగాలు
నీ హృదయాన్ని తాకి జల్లుమనగా
హరిచందన కుసుమం నీ మోము
నింగిలోని చందమామ మత్తిలి
మనస్సు మర్మం ఎరిగిన చందం
కానుగ చెట్టుపై నిద్దరోతున్న గండుకోయిల
రెప్పపాటున మేల్కొని రాగాలాపన చేస్తుంటే,,,,,,,!
పూలు తమ రెక్కల తలలూపుతూ
నీ ముఖారవిందం అరవిరిసిన మందారం
వెన్నెలలో కుసుమాల దరహాసాలు
వింత వింత మత్తిలు సుగంధాలు
సెలయేటి నురగల అలలు
సెడదీర్చు మౌన మందహాసాలు
గోపాలుని వేణుగానం
పరవశంతో పులకరించు మది!
దోరగా పండిన మామిడి చెట్టుపై పండ్లు
నీ కర కమలాలతో కోస్తుంటే
నా హృదయంలో తీయని బాధ!
తెల్లని కుందేలు జాబిలి పూచే వెన్నెలలు
మరుమల్లెల అందాలు గుప్పుమనగా
నడిరేయి నిద్దుర మరచిన మనస్సు
వేయి పడగల కింద హాయిగా నిద్దరోతున్న హరి
శోభిల్లు హృదయాలు సేదదీరెందుకుపక్రమించగా
కొండలపై నర్తించే మయూరాలు
ఆకాశంలో మిణుకు మిణుకు మని మెరిసే నక్షత్రాలు
ఒకటొకటిగా జారి భువిపై పడుతున్న చందం
మనస్సు పూవై వికసించి దిండుని హత్తుకుని నిద్దరోయింది!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *