మృగమనుష్యుల వింత వింత పోకడల్లో
మనస్సు గొట్టాలెపుడో మూసుకుపోయాయ్
మనస్సు కన్నీళ్ళు పెడుతుందంటే ఎవడిక్కావాలి,,,,,,,!?
విపరీతంగా పెరుగుతున్న టెక్నాలజీ
పట్టపగలే మృగాలు తిరుగుతున్నాయ్
ఏ మనిషి మృగము ఏ స్వేచ్ఛా లేక ఒకరినొకరు రాసుకుంటూ ఇరుకు సందుల్లో మురికి వాసనల్లో క్రుళ్ళి కంపుకొడుతున్నారు,,,,,,,,
క్షణానికొకడు పుట్టుకొస్తూ చస్తూ వెర్రిపీనుగలు,,,,,,,,
తన తల మెదడు ఉందని మరిచిపోయి నూతనత్వ మనుకుంటున్న దిదే,,,,,,,,
తలలు పుచ్చి పురుగులు తింటున్నా
ముఖమనుకునే దానికి రంగులు వేసి వినూత్న అందమనుకునే మృగజీవనం,,,,,,,,
కొత్తకొత్త ఫ్యాషన్లనే జంతు చర్మాల్లా ఒంటిపై బట్టలు,,,,,,
పొద్దస్తమానం విరగమురగ పనులు
ఏం చేస్తున్నామో ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు,,,,,,,,
ఆకలి అన్నది లేకుండా ఎప్పుడూ ఏదోఒకటి గలీజ్ తిళ్ళు తాగుడు,,,,,,,
ఆలోచనలన్నీ మురుగు కాలువలై శరీరం నిండా ప్రాకుతూ,,,,,,,,
జంతుజీవనం జగమంతా క్రూర మనోవైకల్యం
జనమంటే జంతుప్రపంచం విషసర్పాలు
వికృత మానవ మృగాలు
ఈ సైన్సు టెక్నాలజీ విపరీతంగా పెరిగి మృగాళ్లయ్యారు
టిక్కు టిక్కు మంటూ వత్తడం తోనే ప్రపంచమంతా కళ్లెదుట బూజుపట్టిన దగుల్బాజీ అడవి క్రూర జంతువులు,,,,,,,
మనిషి తలనిండా లుకలుక మని పురుగులు
తలలు ఇంకెక్కడ ఉన్నాయి,,,,,,,తీసేయ్,,,,!?!
అపరాజిత్
సూర్యాపేట