మనిషి విలువ
మనిషి మెదడు తూకం వేసి అమ్మితే
అక్షరాల లక్షల రూపాయలు అమ్మేయొచ్చు
కళ్ళు వేలం వేస్తే దృశ్యప్రపంచాన్నంతా గోదాట్లో విసిరియొచ్చు లక్షలు ఆర్జించొచ్చు,,,,,,,
కప్పు రంగునీళ్ళు తాగించి రెండు బాటిళ్ల రక్తం తీస్తూ బ్లడ్ బ్యాంకు పెడితే ఏ చదువులు ఎందుకు ?
ఏకంగా ఓ మనిషిని చీల్చి గుండెలు, కాలేయాన్ని ఇంకా ఏవైనా ఉంటే అమ్మి ఓ కోటలాంటి భవంతి కట్టొచ్చు,,,,,,,,
కాళ్ళు చేతులు అమ్మేస్తే జీవితాంతం హాయిగా ఒకాడ పడుండి బ్రతకొచ్చు,,,,,,
మట్టిలో మట్టిగానో,మంటల్లో మసియై పోయే దేహానికి ఇంత విలువా ? దీనియమ్మ వెర్రి లోకం,,,,,
అపరాజిత్
సూర్యాపేట