మహమ్మద్ రవూఫోద్దీన్ అంశం యుద్ధం ముగిసిందా

శీర్షిక: యుద్ధం- అద్దం

యుద్ధం ముగిసింది
ప్రపంచం మురిసింది
ఇన్నాళ్లు మరిచింది
ఇప్పుడు అచట ఏం మిగిలింది?

మట్టి దిబ్బలు
శవాలు గుట్టలు
మూయలేము -మోయలేము
రండి!
కలిసి కన్నీరుతో ఖననం చేద్దాం

నిలపలేము ఆపలేము
ఏమీ మలపలేము
రండి!
కలసి తలంపులలో నిలుపుదాం

మాట పోదు
మూటలేదు
రండి!
కలిసి ముచ్చట పెడదాం

శాంతి బాటలేదు
జాలి ఊట లేదు
రండి!
ప్రేమ తోట పువ్వులు పూయిసాదాం

అచట నవ్వు లేదు
పూచే పువ్వు లేదు
రండి!
కలిసి శాంతి గువ్వలు ఎగిరేద్దాం

అచట ఆబాది లేదు
బర్బాదికి లెక్కలేదు
రండి!
ఖదం మిలకే యాద్ చేద్దాం

ముసలి కన్నీరు కార్చే
ఓ! అగ్రరాజ్యమా!

గుండె గాయాలకు
తీపి మాటల
సాంత్వనా లేపనం
ఎన్నాళ్లు పూస్తావ్

బిక్కుబిక్కుగా
భయం భయంగా
రాలిపోతున్న బతుకులకు
కల్లబొల్లి కబుర్లు ధైర్యం
ఇంకెన్నాళ్లు నూరిపోస్తావ్

నిరాశ నిస్పృహల
గుండె అలలు తన్నుకొస్తుంటే
ఆశల మట్టి ఆనకట్టలు
ఇంకెన్నాళ్లు కడతావు

యుద్ధం ముగిసింది
ప్రతిబింబం చూపే అద్దం అలిగింది

ఇది నా స్వీయ రచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *