నిశీధి నీలాకాశంలో
పాల వెన్నెల కాంతులు
ఆడపిల్లలు…..
అసమానతల
పడగనీడలు దాటి
ఆంక్షలు,కక్షలు లేకుండా
ఆకాశంలా చూడండి….
అన్నింటా తానై
ఆనందాన్ని అందిస్తుంది…!!
వాస్తవికతకు
అద్దాలు
ఆడపిల్లలు…..
వేకువ కిరణాలతో
మహోదయానికి
స్వాగతం పలికేలా
భద్రంగా బతకటానికి
భరోసా ఇస్తూ
భూమిలా చూడండి….
అన్నింటిని
సహనంతో భరిస్తుంది…!!
ఆత్మీయతను పంచే
మహారాణులు
ఆడపిల్లలు…..
రెక్కలు
విప్పిన చైతన్యంతో
నిర్భయంగా నడవడానికి
చేయూత నిస్తూ
ప్రేమించి చూడండి….
అన్నీ సాధ్యమేనని నిరూపిస్తూ
గృహాన్నే స్వర్గసీమ చేస్తుంది..!!
బడికి వెళ్ళటం
నా ప్రాథమిక హక్కు అని
ధైర్యానికి ప్రతి రూపమై…
బాలికా విద్య కి
ప్రపంచ బ్రాండ్
అంబాసిడర్ నిలిచి…
పాకిస్థాన్ లో
సంచలనం సృష్టించిన
యుద్ధ విలేఖరి మలాలా….
భవిష్యత్తు వైపు
“అమ్మాయిల అడుగులకు”
ఆదర్శం….!!
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల