ఓ మహిళా నీ భర్త తాగుబోతై తిరుగుబోతై
జీవనం గడవక మగవాళ్లకు ధీటుగా పొలం దున్నే నారీమణి,,,,,,
సంకన బిడ్డతో సాళ్ళు సాళ్లుగా హలంతో పొలం దున్నడం
ఎవరు నేర్పారమ్మా ఈ కాయాకష్టం,,,,,,!?
ఎగశ్వాస దిగశ్వాసలతో ఎడ్లను అదిలిస్తూ కష్టపడే నైజం కాకమ్మ కబుర్లు కావుకదా తల్లీ,,,,,,,,
మండే ఎండల్లో కురిసే వానల్లో నీ అడుగుల్లో కదులుతున్న దరిత్రి,,,,,,,
వ్యవసాయం ఓ ప్రహసనం కష్టాల కావాడిమోతల కన్నీటి ఎదతో
నిట్టనిలువునా చెమటల సేద్యం తప్పని కష్టం
ఉత్తుత్తి మాటలు కావు సేద్యమంటే,,,,,,,,
నీ కన్నీటి కడగళ్ళ సేద్యం మగాళ్లతో ధీటుగా ధైర్యం పుంజుకుని ముందుకు మున్ముందుకు సాగే కడలి తరంగాల దీక్ష,,,,,,,,
ఎద్దులతో సమానంగా నీవొక బండెద్దువై కలల పంట పండించే శ్రమల తీరు ఆ దేవుడు నిన్ను నిన్నుగా నిలబెట్టే సీతమ్మ కష్టాలు,,,,,,,,,
నీవు పండించిన పంట ఇంటికి తెచ్చే నారీమణి నీవు విశ్వ విజేతవు ,,,,,,,,,,
నీ జానెడు కడుపు పంట పసివానిలా ఈ పంటలు పండించడం ఓ లెక్కా నీకు,,,,,,,,,
చమటల సేద్యంలో ఆరితేరెందుకు నీకై నీవు నీ జీవితాన్ని ఉరుకులు పరుగులతో ధైర్యంగా ముందుకు సాగే యువనారీమణి నీకిదే నా సెల్యూట్,,,,,,,,,,
పరిగెత్తే గోదావరి జలపాతమైనట్లు నీ కష్టమే నీకు నీ కుటుంబానికి వెన్నుదన్ను,,,,,,,,,
నారీమణి జీవితం నేర్పే పాఠాలతో సాగిపో ముందుకు మున్ముందుకు రైతువై నాగలి మేడి పట్టుకుని,,,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట