మార్పన్నది మనిషిలోనిదే…!!!

మార్పన్నది మనిషిలోనిదే…!!!

సమాజం కథలతో ఊకుడని
గొర్రెల్లా వింటూ తలలూపినన్నాళ్ళు…
ఇలాంటి తోడేళ్ళు మేకవన్నె పులులు
పుడుతూనే ఉంటాయి కళ్ళబొల్లి మాటలతో
తమవాటాన్ని కుదుర్చుకొని పోతుంటాయి…
మార్పన్నది మనిషిలోనిదే తెలుసుకొంటే…

నీవు చేయిచాపి అడుగకు
అవతలివాడి మోచేయి నీళ్ళు తాగకు…
భూమి పంచభూతాల సాక్ష్యాలతో నిర్మాణం
దేని కొరకో ఎదురు చూడడమెందుకు…
మనిషిగా మానవత్వాన్ని కలబోసుకొని
శ్రామిక వాదంతో నిరంతర అన్వేషకుడవై…
దురదగాళ్ళ ఉచిత బోధనలను మూటగట్టు

మహిమాన్వితులమని మాలో ఉన్నది
నీతీ నిజాయితీలతో పారే రక్తమని…
ఎముకలేని నాలుకతో భుజం తట్టుళ్ళు…
జెండామోసిన పాపానికి పోసే రంగునీళ్ళు
మారని మనుషులుగా వాళ్ళెనకే నీవైతే
తెలవారని బతుకులతో మనమింతే…

స్వాతంత్ర్య భారతంలో అందరూ
స్వేచ్ఛా వాయువులను పీల్చుకొనువారే
విషయవాంచలతో కొత్త ఆశలకు పుట్టక…
మనస్సుతో చేతనవై స్నేహంతో చెలిమివై…
సమతా మమతల సమభావనలతో సంఘమై
స్వార్థం వీడిన తీరుతో సమస్థానికి రూపమై…
భావితరాల మార్గదర్శకానికి దారులేయాలి
అదే అభ్యుదయానికి శ్రీకారం చుట్టాలి…

దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *