మార్పు కోరితే నా దేశం

మార్పు కోరితే నా దేశం

మీసం తిప్పిన
రోషo చూపిన
శ్రామిక బతుకులు
ఆకలి కేకలు

బలిమి చావులు
విసిగి వేసారిన
దౌర్భాగ్యపు
నాగరికత ఉన్న

అక్షర నాలిక
ప్రక్షాళన గీతిక
అన్యాయప ధోరణి
అంతం చేయుటకు ఉందో

ఆకాశంలో ఇసుకు రేణువులు
పొలం చాటున నాగలి బీటలు
జానెడు పొట్ట కాలిపోయినది

అమ్మ బాబు ఆకలి కేకలు
అంతుచిక్కని భూ దందాలు
వేలు చూపి మాట్లాడితే భయం
ఒంటరి నా జీవితానికి క్రయం

కాలి పాదుకలు అరిగినవి
చేతిన డబ్బు లేకుండా నలిగితిమే
భూములు శూన్యము మాకింకా
మా బ్రతుకున ఏడ్పులు అన్నింట

బడా బాబుల పేర్లు చెప్పి
రాజకీయ రంగుల పులిమే
నోరు ఎత్తితే పళ్ళు రాలును
నోరు మూసితే భూ దందాలు

శిరోభారమై నడిచితివి
మెడ పై తలకాయ లేదన్నట్లు
కామాంధుల అత్యాచారం
కార్గిల్ యుద్ధం కంటే ఘోరం

రుస రుస మంటూ నవ్విన
బుస బుస మంటూ పడగలు ఎత్తిన
ఇంట్లో గొల్లేము వీధిన కళ్లెం
మా నోర్లను మూసిన అధికారపు తంత్రం

పెట్రోల్ ధరలు పెరిగిన వైనం
పేకాటల కూలిన నైజం
శ్రామిక ప్రజల ఆకలి సౌర్యం
ఎదురు తిరిగితే పోరాటపు ధైర్యం

పిల్లి ని సైతం గదిలో పెట్టి గొళ్ళెం వేస్తే
బానిసత్వము అంత ముందడం
దౌర్భాగ్యము అనచిపోయే
అమయికత్వం త్యాజించి
విప్లవ కథలను పూరిద్దాం
జనజీవన గెలుపును సాధిద్దాం

వందేమాతరం నా జీవితం
వందేళ్లు అయిన మారని ఈ తరం
మార్పు కోరితే అంతా సౌఖ్యం
వెధవల బ్రతుకులకు స్వస్తి పలుకుదాం.

యడ్ల శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *