2008లో దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో కాల్పులు, బాంబు దాడులు చేశారు. 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్మహల్ ప్యాలెస్, టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో, సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో, విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.
ఉగ్రవాద దాడుల సమయంలో ముంబై పోలీసు కమీషనర్ హసన్ గఫూర్ నాయకత్వం సరిగా లేదన్న ఆరోపణలతో రామ్ ప్రధాన్ కమీషన్ నివేదికలో అభియోగాలు మోపబడడంతో హసన్ గపూర్ ముంబై పోలీసు కమీషనర్ హోదా నుండి మహారాష్ట్ర పోలీస్ హౌసింగ్, వెల్ఫేర్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేయబడ్డాడు.
ముంబై దాడులను ఈ దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడి జరిగి నేటికి 17 ఏళ్లు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 175 మంది మరణించారు. 166 మంది అమాయకమైన ప్రజలు కాగా, 9 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఒకే ఒక్క టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఇతడిని విచారించగా, పాకిస్తాన్ ప్లాన్ బయటపడింది. ఇండియా న్యాయచట్టాల ప్రకారం, ఇతడికి ఉరిశిక్ష విధించారు. ఈ దాడుల వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా ఉంది. 2008లో జరిగిన ఈ ఉగ్రదాడుల్లో 20 మంది భద్రతా బలగాలు, 26 మంది విదేశీయులు మరణించిన వారిలో ఉన్నారు. 300 మందికి పైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.
తుకారాం ఓంబ్లే , మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ , హేమంత్ కర్కరే-అశోక్ కామ్టే-విజయ్ సలాస్కర్ , మల్లికా జగద్ , కరంబీర్ సింగ్ కాంగ్ , థామస్ వర్గీస్ కాల్పులు ప్రారంభమైన తర్వాత కస్టమర్లను కిందకు వంగి ఉండాలని కోరారు. రెస్టారెంట్ నుంచి అందర్ని సురక్షితంగా పంపించేసి, తానను చివరకుగా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చే క్రమంలో టెర్రిస్టులు అతడిని చూసి కాల్చి చంపారు. ఎంతో మంది కోసం అతను ప్రాణాలు అర్పించి హీరోలుగా నిలిచారు.
మాధవి కాళ్ల
సేకరణ