ముత్తరాజు సుబ్బారావు(నాటక రచయిత, శ్రీకృష్ణతులాభారం , పద్యాలు, ప్రసిద్ది)

ముత్తరాజు సుబ్బారావు (జనవరి 14, 1888 – సెప్టెంబర్ 17, 1922) సుప్రసిద్ధ నాటక రచయిత. వీరు శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు.

సుబ్బారావు 1888, జనవరి 14న నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని పోతెగుంట లో జన్మించారు.
వీరు బి.ఎ. పట్టా పొంది బందరులోని నొబుల్ కళాశాలలో చరిత్రను బోధించే అధ్యాపకులుగా పనిచేశారు.
వీరి ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది. దానికి స్వర్ణపతకం వీరికి లభించింది. ఇవి కాక బి.ఎ. చదివే విద్యార్థుల కోసం చరిత్ర పుస్తకాలు రచించారు. ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం (నాటకం) కోసం రాసిన పద్యాలను శ్రీకృష్ణ తులాభారం సినిమాలో వావడం జరిగింది.

సంపాదించిన డబ్బునంతా ధర్మాలు చేసి చివరికి నిరుపేదగా 1922 సెప్టెంబరు 17 తేదీన పరమపదించారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *