జీవితంలో కలసిన
వెన్నంటే నడిచిన
ప్రతి ఒక్కరూ పాఠము
నేర్పుతారు వాస్తవము
మితిమీరిన కోరికలు
దుఖానికి కారణము
దారిద్ర్యముకు మూలము
ఆవహించిన బద్ధకము
జగతిలో నడుస్తున్నది
చూడంగా స్వార్థము
ఎక్కువైతే మాత్రము
వాటిల్లును ప్రమాదము
ఎవని కడుపు వానిని
పని చేయిస్తున్నది
ఇది ముమ్మాటికీ నిజము
కళ్లేదుట జరుగునది
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల