మోహన్ మహర్షి(నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత)

మోహన్ మహర్షి (1940, జనవరి 30 – 2023, మే 9) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత. 1992లో దర్శకత్వం విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు.

మోహన్ మహర్షి 1940, జనవరి 30న రాజస్థాన్ రాష్ట్రం, అజ్మీర్ జిల్లాలోని అజ్మీర్ నగరంలో జన్మించాడు.
1965లో న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పట్టభద్రుడయ్యాడు, తర్వాత 1984-86లో డైరెక్టర్‌గా పనిచేశాడు.

మోహన్ మహర్షి హిందీలో ఐన్‌స్టీన్ (1994), రాజా కీ రసోయి విద్యోత్తమా,సాన్ప్ సీధి, ఆంధయుగ్, రాణి జిందాన్‌, ఒథెల్లో, హో రహేగా కుచ్ నా కుచ్ (మార్షా నార్మన్ 1983 ఆంగ్ల నాటకం ‘నైట్, మదర్), డియర్ బాపు (2008) వంటి ప్రసిద్ధ హిందీ నాటకాలకు దర్శకత్వం వహించాడు. ఐన్‌స్టీన్, రాజా కీ రసోయి, జోసెఫ్ కా ముకద్మా, దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతీ థీ, హో రహేగా కుచ్ నా కుచ్ మొదలైన నాటకాలు రాశాడు. భారత్ ఏక్ ఖోజ్ అనే చారిత్రక ధారావాహికలో ముస్లిం సంఘ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్‌గా కూడా నటించాడు.

1973 నుండి 1979 వరకు, మారిషస్ ప్రభుత్వానికి నాటకరంగ సలహాదారుడిగా పనిచేశాడు. మారిషస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అతను చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ థియేటర్ విభాగాన్ని బోధించాడు. 1987లో ప్రొఫెసర్‌గా తన రెండవ పదవీకాలాన్ని ప్రారంభించి దాని విభాగాధిపతి అయ్యాడు. 2004లో పదవీ విరమణ చేసే వరకు చండీగఢ్‌లో నివసించి, ఆపై నట్వా థియేటర్ సొసైటీని స్థాపించడానికి న్యూఢిల్లీకి తిరిగి వెళ్ళాడు.

మోహన్ మహర్షి తన 83వ ఏట 2023, మే 9న మరణించాడు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *