కథనం
అంశం :నిందలతో కాపురం
శీర్షిక :యువజంటల కాపురాలు ,,,,యవ్వనం పొంగు,,,,,,
రచన : అపరాజిత్ రెడ్డి
యువతరం వైజ్ఞానిక జ్ఞానతృష్ణ శ్రమలతోనే
ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుంది
నవీన యువ జంటలు తాము చదువుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో
రకరకాల పెద్దపెద్ద కంపెనీలలో కంప్యూటర్లతో,ల్యాబ్ ట్యాబ్ లతో పొద్దస్తమానం కుస్తీలు పట్టి
అలసిసొలసి ఇళ్ళు తమ కుటుంబాలతో మల్లగుల్లాలు పడుతూ,,,,,,,,,
తమ పిల్లల పోషణ,వాళ్ళ చదువులు ఇరువురికి తలకు మించిన భారమవుతూ,,,,,,,,,,
చిన్నచిన్న విషయాలకే గోరంతలు కొండంతలు చేసుకుని ఉద్రేకపడటం సహజం,,,,,,,
కొన్నికొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడం సహజమై పోయాయి,,,,,,,,
దరిదాపు పది పన్నెండు గంటలు లోకాన్నే మరచిపోయి చేసిన మానసిక శ్రమల వల్ల విసిగిపోయిన జీవితాలు కమిలిపోయిన గులాబీలు,,,,,,,,
దంపతులు ఇరువురు నెలకు లక్షలకు లక్షల వేతనాలు సంపాదిస్తూ తాము తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని అందరి ముందు తలాయెత్తుకుని బ్రతకాలని కోరుకుని ఇరువురు శ్రమించడం సహజం,,,,,,,,,
యువ రక్తం పొంగులో కొంత ,అతివేగంగా మారుతున్న సంస్కృతి ,మానవ సంబంధాలు చీకట్లు కమ్ముకుంటున్నాయి అయినా ప్రతినిత్యం పొట్లాడుకోవడం తగదు,,,, ,,,,,,
ఇలాంటి సాంకేతిక సంబంధమైన ఉద్యోగాలు చేసేవారికి వారానికి ఐదు రోజులు పనిదినాలు ఆ రెండు రోజులు దంపతులు ఇరువురు హృదయాలు విప్పి మాట్లాడుకోవడం తమ పిల్లలతో కాలక్షేపం చేయడం మనస్సులకు ఆహ్లాదాన్ని ఇస్తాయి,,,,,,,,,,
తమకు ఇష్టమైన సాహిత్యం అధ్యయనం చేస్తే హృద్యమైన ప్రేమ ,అనురాగాలు ఇరువురి బాంధవ్యాన్ని పటిష్టం చేస్తాయి,,,,,,,,,,
ఇరువురి మద్య నల్లగులాబీల స్థానే వెలుగు వసంతాల పున్నమలు జీవితంలోకి ఆహ్వానించినట్లే ,,,,,,,,,,,,,
ప్రతిదినం వీక్షించే టీవీలు ఆ రెండు రోజులు ఆపేయండి, సాయంత్రం అలా పిల్లలతో పార్కుకు వెళ్ళి ఆనందంగా గడిపిరండి.,,,,,,
మీరిద్దరూ కూర్చుని ఒక ప్రణాళిక ప్రకారం ఇంటిపనులు ,వంటపనులు ఇద్దరు కలివిడిగా కలసిమెలసి చేసుకుంటే జీవితాలు సాఫీగా సాగిపోయే నూతన వసంతాలు చవిచూస్తారు,,,,, ,,,,,,
అపరాజిత్
సూర్యాపేట
హామీ పత్రం : ఈ రచన నా కలం సేత యని నా హామీ