ఈ అవనిపై పంటచేలు,కొండలు, మైదానాలు
అల నింగిలోని కారుమబ్బులు, సుప్రభాత సూరీడు
అన్నీ రంగు రంగుల పూవుల మల్లే
భూతలస్వర్గంలా పూసిన ఇంద్రధనస్సులా
సింగారించుకున్న పడతి మైమరపించే సౌందర్యంలా
ఇలాతలమంతా సొగసు లద్దుకున్న మురిపాల మౌన లావణ్య సీమలా
సృజియించిన చిత్రకారుని హృదయం
అద్భుత ప్రతిభలో అలరారిన పెయింటింగ్
హృదయం లోతుల్లోని భావనా కుసుమాలు
కుంచెతో జీవన విధానాన్ని సౌభాగ్యసీమ చేసుకొమ్మంటున్న సందేశం,,,,,,,,,
గడ్డిపోసల్లో, బండరాళ్లలో,మట్టిగడ్డల్లో
సౌందర్యం చూసే కళ్ళు
తూర్పున తొంగిచూసే భానుడు కీరవాణి రాగంలో లేతకిరణాల సుకుమారత్వం
నింగిలో తేలియాడే మబ్బులు మౌనవీణలా
గుభాళించే పరిమళాల్లో రంగు రంగుల పుష్పాలు
నవయవ్వన కుసుమ కోమలి ప్రకృతికన్య
నవ్యజీవన విధానం హృదయం పూసిన పారిజాత పుష్పం
స్వర్గసీమలో విహరించిన చందం చిత్రం కళ్ళల్లో తేలియాడే అప్సరస,,,,,,,
పరమాత్మజుడు ఎవరో చిత్రకారుని హృదయంలో స్వర్గతుళ్య ఆత్మను మేల్కొలిపి సృష్టి అందాలను, పరమానందాలను ప్రభోదించిన ఫలితమే ఈ పెయింటింగ్ అనుకుంటాను,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట