అలలు అలలుగా ఉప్పొంగి వస్తున్న ఆలోచనలు
జీవనతీరాలు దాటి లోలోతుల నుండి ఉబికివస్తూ
మనస్సు గూడులో తీయని దుఃఖిత రంది
రక్తం మరకల ఆలోచనలను కలం లోకి ఒంపుకోలేని వ్యధ
చుట్టూర ఎవ్వరూ లేని గాఢ నిద్రలో ప్రపంచం
ఈ ఏకాంతంలో ఏవో తెలియని ఆలోచనలు లోతైన లోయల్లోంచి ఉబికివస్తూ,,,,,,
ఊహలకు ఉరేసి జీవితం పాడిన విషాద గీతాలను లిఖిస్తూ నేను,,,,,
ఎవరెవరో ఎక్కడెక్కడో హృదయాన్ని గాయపరచి వెకిలి నవ్వుల వికటాట్టహాసం గుర్తుకొస్తూ,,,,,,,
జీవితం కొనసాగినంత మేరా ఈ జోగిబాబుల చెరలు,,,,,
నిర్జీవమైన రక్తంచిందే అక్షరాలు ఉలిక్కిపడుతూ,,,,,
ఈ చదువు లోతులు తెలియని మూర్ఖులు దృతరాష్ట్రుల మధ్య ప్రయివేటు కొలువులు,,,,,
చదువు అంగడిబొమ్మయి అనాకారి నర్తనలో డబ్బులేరుకుంటూ,,,,,,
పిల్లల చదువులు ,పుస్తకాలు గంగలో తేలియాడుతూ పరుగులుపెడుతూ,,,,,,,
పిల్లల బట్టీయంతో ప్రగతి రథ చక్రాలు నిర్జీవంగా మహోన్నతి బడులు పోటాపోటీగా,,,,,
ప్రయివేటు పంతుళ్ళ జీవితాలు అరకొర కాసులకు అమ్ముడుపోతూ పస్తుల రేషన్ బియ్యం జీవితాలు,,,,,,,
ఇంట్లో గుయ్యుమనే దోమలతో చెలిమిలో కుటుంబాలు రోదనా గీతాలు,,,,,,
బడి అనే బద్మాష్ ల అజమాయిషీలతో సుదీర్ఘ దినాలు గడిచిపోతూ గాడితప్పిన జీవితాలు,,,,,,,
ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ జీవితం కుతకుత ఉడికే మనస్సు గూడు,,,,,,
గుడ్లురుముతూ చూస్తూ పనిచేయించుకునే కేరాఫ్ ప్లాట్ ఫామ్ గాళ్ళ చేతుల్లో లేడీ టీచర్లు బలి,,,,,
అక్షరాలు కన్నీరిడుతూ సంస్కరించలేని చదువుల నిలయాలు ప్రభుత్వాలు బడాబాబుల నోట్లకట్టలకు అమ్ముడయ్యే విషనాగులు,,,,,,,,
నేటికీ ఏనాటికీ అక్షరాలు అమ్ముడు సరుకవుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా !!???!!
అపరాజిత్
సూర్యాపేట