రక్తసిక్త కోటగోడలు,,,,!!

రూపశిల్పి హృదయం కళా నైపుణ్యం దృక్కోణం దిక్సూచి మేరా,,,,,,
ఆకలి కుక్షుల నిరుపేదల మరిగే రక్తం శ్రమలలో చిందించిన స్వేదం ఫలితమే ఈ కోటగొడల నిర్మాణం,,,,,,,,
ఈ కోటగొడల మద్య భోగవిలాసాలతో రాజ్యాల నేలే రాజులు రాణులతో సరససల్లాపాలలో బలిపశువులు నిరుపేద చెలికత్తెల అవిశిపోయిన గుండె కోతలు ,,,,,,,,,
నర్తినీ శిరోమణు లెందరో వెలయాళ్ళై దుర్భర జీవితాలను అనుభవిస్తూ హృదయాలను పిండి పిప్పిచేసుకుని తమ జీవితాలను కళలను చంపుకుని లాలసలైనది ఈ కోటల ఖడ్గచాలనాల మద్యే,,,,,,,,
కవులు ఆకలి ఆఖరి పిలుపుల్లో రాజులు, చక్రవర్తులు,మంత్రులు సుఖరోగులను హృదయాలను చంపుకుని తమ దారిద్య జీవితాలను గుర్తెరిగి అభూత కల్పనలలో పొగడ్తల సాహిత్యాన్ని సృష్టించి మెప్పులు పొందితే గుండెలు బండల్లా ఫెటేల్మని పగిలిపోగా,,,,,,,,
కవులు కాసుల కొరకు ఒకరిని మించి ఒకరు కురూపులను సౌందర్య శీలురుగా వర్ణిస్తూ, ,,,,,,,,,,
రాజ్యంలోని ప్రజలు ఆకలి కేకలలో తమ రక్తాన్ని యుద్ధాలలో చిందించి గావుకేకలలో తలలు తెగిపడినవి మరచిన వైనం,,,,,,,,,,
రాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని వర్ణించిన తీరు కవి దరిద్రగొట్టు కవిత్వం ఖండఖండాలు చేసి కాకులకు గద్దలకు వేయాలి,,,,,,,,,
చక్రవర్తులు, రాజులు పాలనలో ఖడ్గచాలనాల మద్య రాజ్యాలలోని ప్రజల ఆక్రందనలు, ఆకలి కేకలు ,,,,,,కవులు ,కళాకారుల దాస్యంలో స్వర్ణయుగాలు చవిచూసింది అవాస్తవమే సత్యమై వెలుగుచూసింది,,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *