రచయిత అక్షరం విలువ
ఏం రెడ్డిగారు బడిపంతులు ఉద్యోగం ఎంతవరకు వచ్చే. అంటే ఆయన ఉద్దేశం నేను ఎంత సంపాదిస్తున్నాని.నేను ఆ ఏముంది లెండి జీవితం ఇట్లా గడిచిపోతుంది,,,,,,,అన్నాను. రచయిత వట ఊరంతా అనుకుంటున్నారు నెలకు ఎంత సంపాదిస్తున్నావేం? అక్షరం అన్నం పెట్టదని తెలియక ఇన్ని రకాలుగా ఆరాలు తీస్తున్నాడు.ఏం లేదండి సాధ్యమైనంత మేరా సామాజిక చైతన్యం కోసం రాస్తున్నాను కాలీ సమయంలో అని అన్నాను. దానికి అతను విరగబడి విరగబడి నవ్వుతూ,,,,, ఏం సామాజిక మార్పయ్య కూడుబెట్టని రాతలు నీవూనూ,,,,, నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా,,,,, అంటూ చెప్పుకుపోతున్నాడు,,,,,మా అబ్బాయి చేపల వ్యాపారం చేస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నాడు. దర్జాగా బ్రతుకుతున్నాడు ,కూడుబెట్టని విద్య ,రాతలు కోతలు దేనికయ్యా,,,,,,,,అంటుంటే వాడిని అక్కడనే దవడ వాచేలా కొట్టబుద్ది అయ్యింది,,,,, నేను తమాయించుకుని బాబాయ్ గారు బయట నాకు పనివుంది వెళ్తున్నాను వస్తారా,,,, అంటూ లేచాను. సరేలే అంటూ వెళ్ళిపోయాడు.
నేడున్న సమాజానికి ఏ చదువు సంధ్య లేకున్నా డబ్బు సంపాదనే ప్రధానం నీవు ఎలాగైనా సంపాదించు డబ్బు ప్రధానం.
అపరాజిత్
సూర్యాపేట