రావి కొండలరావు(తెలుగు సినిమా నటుడు, రచయిత. నిర్మాత ,దర్శకుడు)

రావి కొండలరావు (ఫిబ్రవరి 11, 1932 – జూలై 28, 2020) నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి. దాదాపు 600 చిత్రాలలో నటించాడు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి.

1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు.

ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 1958లో ‘శోభ’ చిత్రంతో అతని సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. రాధాకుమారి గారు జన్మించినది విజయనగరంలో. ముందు ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం తేనె మనసులు.

నటుడిగా…
ప్రధాన వ్యాసం: రావి కొండలరావు నటించిన సినిమాల జాబితా
కింగ్ (2008)- అతిథి పాత్ర
మీ శ్రేయోభిలాషి (2007)
నిన్నే ఇష్టపడ్డాను (2003)
శ్రీ కృష్ణార్జున విజయం (1996)
మేడమ్ (1993)
బృందావనం (1992 సినిమా)
పెళ్ళి పుస్తకం (1991).

రచయితగా…
భైరవ ద్వీపం (1994) (సంభాషణలు)
బృందావనం (1992 సినిమా) (సంభాషణలు)
పెళ్ళి పుస్తకం (1991) (కథ)
చల్లని నీడ (1968) (రచయిత)

నిర్మాతగా…
శ్రీకృష్ణార్జున విజయం (1996) (పర్యవేక్షక నిర్మాత)
భైరవ ద్వీపం (1994) (పర్యవేక్షక నిర్మాత)
బృందావనం (1992 సినిమా) (1992) (పర్యవేక్షక నిర్మాత).

ఇతడు సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశాడు. హాస్యరచయితగా గుర్తింపు పొందాడు. సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశాడు. ఇతడు వ్రాసిన కొన్ని కథలు:
అనురాగం
అభిప్రాయం
అభిమాన పుస్తకం
అసంభవామి యుగేయుగే
ఆడదిక్కు.

పుస్తకాలు
(సి)నీతిచంద్రిక
హ్యూమరథం (రెండు భాగాలు)
మల్లీశ్వరి (సినిమా నవల)
బ్లాక్ అండ్ వైట్
రావి కొండలరావు నాటికలు
రావి కొండలరావు కథలు
నాగావళి నుంచి మంజీర వరకు.

బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం – 2004 సంవత్సరానికి
అ.జో-వి.భొ. కందాళ ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం.
హైదరాబాదు బేగంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020, జూలై 28వ తేదీన సాయంత్రం గం. 4.35 ని.లకు గుండెపోటుతో మరణించాడు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *