అక్షర లిపి సంక్రాంతి కవితల పోటీ…
అంశం : చిత్ర కవిత
దేరంగుల భైరవ (కర్నూలు)
కర్నూలు (జిల్లా)
9100688396
శీర్షిక : రాసుకొన్న ప్రేమలేఖ…!!!
అనురాగం చుట్టుముట్టిన ఆకారం
రెండు మనస్సులను కలిపే ప్రేమాలయం
ప్రకృతితత్త్వం ప్రగతికి నిత్యం కావాలని…
మదినే వేదికగా చేసుకొని నాకు నేనై…!!
హృదయపూర్వకంగా రాసుకొన్న ప్రేమలేఖ…
చదివే రోజులతో మొదటి పరిచయం…
కదిలే రోజులతో పెరిగిపోయిన స్నేహం…
తిరిగిన రోజులతో కట్టుకొన్న ప్రేమదేశం…
రాసుకొన్న రాతలు చేసుకొన్న బాసలు
దగ్గరైన చూపులు బంధంగా కావాలని…!!
అనుదినాన్ని ప్రత్యేకించిన సమయాలతో
వేచియున్నా జారిన సంధ్యలతో చెప్పకనే
గ్రహణం మింగిన మత్తుగా మాయమైనది…
తీపిగుర్తులుగా గడిపిన జ్ఞాపకాలెన్నున్నా
మరిచిన పరిస్థితులతో క్షణాలు మౌనమే…
నమ్మకంలేని బలమేదో గుండె కవాటాలను
తెరిచి ఓదార్చిన గీతాన్ని ఆలాపించినా…!!
కుదుటపడలేదు ఎదలోతుల్లో ఏదో లోపం…
ఈ జీవితం ఎవరికోసమో అనిపించింది…
మనస్సుతో మమేకమై మమకారాలతో
రూపమై శ్వాసలతో లిఖితమైన నిర్ణయం
తాలూకు అనుకోకుండా కనుమరుగైనా…!!
అది ప్రేమకు గాయంగా ఈదని అగాధమే…
కొలతబడని వేదనలు కొరివై కాల్చినవేనని…
కపటమైన కనుల ప్రపంచంలో తేలుతు…
ఆశలను అడుగకా ఆప్తులను నిలుపకా…
నిలువని చీకటి వెలుగులతో చేదెక్కిపోయి
నిరాశలతో నిజాలు నీరుగారి పోయేవేనని
అనుభవంతో నేర్పిన వాస్తవ సత్యమిలేఖ…
పై కవిత నా సొంతమేనని హామి ✅