రాహుల్ రామకృష్ణ(తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత)

రాహుల్ రామకృష్ణ తెలంగాణా రాష్ట్రానికి చెందిన నటుడు, రచయిత, విలేఖరి. సైన్మా అనే లఘుచిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసి తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయకుడి స్నేహితుడి పాత్ర పోషించాడు. జాతీయ పురస్కారం గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు.
తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాదు(1991 జనవరి 15) లో జన్మించాడు. తండ్రి యోగా అధ్యాపకుడు కాగా తల్లి ఓ వ్యాపార పత్రికలో సహాయ సంపాదకురాలు. హైదరాబాదులోని విజేఐటి కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం వరకు చదివి ఆపేశాడు.

ఇతను పోస్ట్ నూన్, మెట్రో ఇండియా అనే దినపత్రికల్లో విలేఖరిగా పనిచేశాడు. ఏదైనా పనిమీద హైదరాబాదుకు వచ్చిన విలేఖరులకు అనువాదకుడిగా సహకరించేవాడు. హిందుస్థాన్ టైమ్స్ పత్రిక నడిపే ఒక సినిమా సమీక్షల వెబ్ సైటులో రచయితగా కొద్దికాలం పనిచేశాడు. ఇలాంటివి కాకుండా పాటల రచయితగా, స్క్రీన్ రైటరుగా, టివిల్లో వంటల కార్యక్రమాల్లో వ్యాఖ్యాత లాంటి వైవిధ్యభరితమైన పనులు చేశాడు.

నాటకరంగం మీద ఆసక్తితో కొన్ని నాటకరంగ సంస్థల నిర్మాణ పనులు చూసేవాడు. అలా అతనికి నటనతో పరిచయం కలిగింది. నాటక రచయితలైన ఎన్. మధుసూదన్, డా. సాగరి రాందాస్ నిర్వహించిన వర్క్ షాపుల్లో పాల్గొన్న తర్వాత అతనికి నటన మీద ఆసక్తి ఎక్కువైంది. వారిద్దరినీ తన గురువులుగా, మార్గనిర్దేశకులుగా భావించుకున్నాడు. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన సైన్మా అనే లఘుచిత్రంతో అతని కెరీర్ ప్రారంభమైంది. ఈ సినిమాకు మంచి ప్రశంసలు రావడంతో జయమ్ము నిశ్చయమ్మురా (2016) అనే సినిమాలో కథానాయకుడి సహాయ పాత్ర చేసే అవకాశం లభించింది. శివరాజ్ కనుమూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, పూర్ణ ప్రధాన పాత్రధారులు.

తర్వాత అతను అర్జున్ రెడ్డి (2017) చిత్రంలో కథానాయకుడి స్నేహితుడు శివగా నటించాడు. ఈ పాత్ర స్నేహితుడు ఏ స్థితిలో ఉన్నా అతనికి అండగా నిలుస్తూ అతనికి నైతిక బలం ఇచ్చే ప్రధామైన పాత్ర. దానికి తగ్గట్టు కొద్దిపాటి హాస్యం కూడా ఈ పాత్రకు జోడించబడింది. ఈ సినిమాతో ఇతనికి నటుడిగా మంచి పేరు వచ్చింది. అర్జున్ రెడ్డి తెచ్చిన పేరుతో 2018 లో భరత్ అనే నేను, సమ్మోహనం లాంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత అమెజాన్ నిర్మించిన గ్యాంగ్ స్టర్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాడు. 2018 లో వచ్చిన గీతగోవిందం సినిమాలో అర్జున్ రెడ్డి లాగానె నాయకుడు విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా కనిపించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 2020 లో అల వైకుంఠపురములో సినిమాలో ఓ పాత్ర పోషించాడు.

నటించిన చిత్రాలు

సైన్మా రాము షార్ట్ ఫిల్మ్
జయమ్ము నిశ్చయమ్ము రా
అర్జున్ రెడ్డి
2018 ఇంటెలిజెంట్
భరత్ అనే నేను

2017: సైమా ఉత్తమ హాస్యనటుడు – అర్జున్ రెడ్డి.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *