రుద్రభాస్కరుడా వెళ్ళిపోతున్నావా,,,,,,,!!

రుద్రభాస్కరుడా వెళ్ళిపోతున్నావా,,,,,,,!!

అవనీ జనకుడా సూరీడా వెళ్ళిపోతున్నావా
గులాబీ రంగు రంగరించిపోసినట్లు ఎర్రెర్రని సూరీడా సౌందర్య రూపసుడా,, ,,,,,,,,,,,,,,,,,,
ఆకాశంలో గులాబీ వస్త్రం కప్పి పిల్లగాలులలో ఈ రోజుకు సెలవిక అంటూ వెళ్ళిపోతున్నావా భాస్కరుడా,,,,,,,,,,,,,,,,
మహోగ్రరూపంతో భువిపై కార్చిచ్చుల మంటలు రగిల్చి మానవులను బెంబేలెత్తించి నీ మానాన నీవు జారుకుంటున్నావా రుద్రభాస్కరుడా,,,,,,,,,,,,,
ఉరికే సెలయేళ్ళను కడుపునిండా తాగి ఎర్రని ఎండలతో పగుళ్ళు దేరేలా ఎండించి దాహంతో తపియించే లోకానికి ఇది తగిన శాస్తియిది ప్రకృతిని చిదిమేస్తారాయని వెళ్ళిపోతున్నావా అగ్నిగోళమా,,,,,,,,,,,,,,,,
నెమ్మది నెమ్మదిగా నీలి నీలి ఆకాశమంతా నల్లరంగు వస్త్రం కప్పుకుని కారుచీకట్ల కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి,,,,,,,,,,,,,,,,
ఈ వినీల ఆకాశం కింద నేను రక్తాక్షరాలను పాడే రక్తకన్నీరు గీతాలు లోకం నా రౌద్ర రోదనా సంగీతం వినేందుకు సాహసించలేక గుబులు గూళ్ళలోకి మనుషులు పశువులు పక్షులు చేరుకుంటున్నాయి,,,,,,,,,,,,,,
ఈ అనంత విశ్వంలో వెచ్చని రుద్రవీణ ప్రసరించే రాగాలు కాంతి కిరణాలు సప్తస్వరాల సంగీతాలలో అగ్నిసమీరాలలో తేలిపోయే నృసింహమా సూర్యభగవానుడా నీకివే నా వందనాలు,,,,,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *