రెండు హృదయాల ప్రేమ భాష్యాలు,,,,,,!!
ఈ వెలుగులు ఈ చిరుగాలి ఈ మళయానిలము
మన జంట చిలకాగోరింకల సాంగత్యం
మన కబుర్లు అలవికాని ఆనందాల సందళ్ళు
మన యవ్వనం పూసిన జీవన హొయలు రాగ రంజితం
హృదయం విప్పి మాట్లేడేందుకు ఏకాంతం నిశ్శబ్ద వెన్నెల రవళులు,,,,,,,,
ఒకరినొకరు అర్థం చేసుకొమ్మని ఈ వసంతలక్ష్మి పూసిన బంగరు రెమ్మల ఆశీర్వాదం,,,,,,,,,,
స్వచ్ఛమైన లేత వన్నె గులాబీల్లా మనస్సువిప్పి జీవం ఉట్టిపడేలా మాట్లాడుకునే హృదయాల గోపురం,,,,,,,,,,,,,
హృదయాల ప్రేమ పాడే గీతాంజలి గీతాల స్వరాలు రంగేలి రాగాలు పన్నీటి జలపాతాలు,,,,,,,,,,
మనం నిర్మల మనోనిలయాలలోని మన వాక్కులు అర్థం చేసుకునేందుకు ఆలంబనలు,,,,,,,,,,
ఈ జీవన సోయగాలు ఉట్టిపడే మంచుముత్యాలు జాలువారినట్లు సువర్ణావకాశం ఈ ఏకాంతం బహుగోప్యం,,,,,,,,,,,
జీవన సాంగత్యం కొరకు బహుసుందరం మన కలయిక ఊహలు నిజం చేస్తూ చేయి చేయి కలగలిపి మనస్సులు పంచుకుంటూ మాటామంతి పదనిసలు
హృదయ రాగాలు మీటినా కొలది ఒకరికొకరు దగ్గరవుతూ ప్రేమ నిండిన భాష్యాల కౌగిలింతలు తీయని పులకింతలు జాబిలి వెన్నెల వర్షంలో,,,,,,,,,
ఈ రేయి పూసే పూవులు వీచేగాలులు రసరమ్య గీతాలు మన సురుచిర సాన్నిత్యం కావాలి నిండు నూరేళ్ళ బహుదానందం అమృతతుల్య సహజీవనం వైపు పడే అడుగులు ఆనందరవళులు,,,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట