దుష్టశక్తుల సంహరణ దినం
విజయుడు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాల సేకరణ దినం
రావణ సంహరణ దినం
దేవేరి కాళిక మహిషాసుర మర్దన దినం
దుష్ట సంహరణ శిష్ట రక్షణ దినం
ధనమాదాందులపై విల్లునెక్కుపెట్టిన దినం
పైశాచిక వికృత దుర్మార్గులను చెండాడే దినం
సకల దుర్మార్గాలు చేస్తూ నమ్మబలికే నాయవంచకులను చెండాడే దినం
దుర్మార్గపు రాజకీయ నాయకుల గుండెల్లో ఫిరంగులు మ్రోగే దినం
అమాయక ప్రజల ఆర్తనాదాలు అంతం పలికే దినం
స్వార్థపూరిత శక్తుల దోపిడీ ననచే దినం
ఒక లక్ష్యంతో ఉవ్వెత్తున ఎగిసే యువతకు దిశానిర్దేశం చేసే దినం
ఆకలితో అల్లల్లాడుతున్న జనానికి ఉద్యమ ఉగ్గుపాలు పొసే దినం
జవాభీతరం లేని ప్రభుత్వాలపై ఎక్కుపెట్టిన బానం ఈ దినం
మధ్యతరగతి కుటుంబీకులు దైన్యం వీడి సరళీకృత వైవిధ్యం సమీకరించుకునే దినం
రంగవల్లులు తీర్చే మహిళా నిరక్షరాస్యులచే అక్షర జ్ఞానంతో చదువుల చైతన్యం నింపే దినం
అజ్ఞాన అంధకారాలను పారద్రోలి అజ్ఞాత మేధావులకు విముక్తి కలిగించే దినం
కులమతాలకు అతీతంగా జాతిని జాగృత పరచే దినం
చదువులమ్మ తల్లి ఒడిలో బడిపిల్లలను మేధోసంపన్నులుగా తీర్చిదిద్దే దినం
అవలక్షణాల అసమర్థులను వెలివేసే దినం
జీవన ధాత్రిపై విజ్ఞాన వెలుగుపుంజాలను ప్రసరింపజేసే దినం
అవును నేడే సుదినం విజయదశమి ,,,,,వీరుల విజయాంకురాలు మొలుస్తున్నాయ్ చూడు,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట