అక్షర సమూహం
అంశం : నేటి పిల్లల ప్రవర్తన—సామాజిక బాధ్యత
శీర్షిక ;విద్యార్థులు,,,,,, కళాశాల,,,,!
రచయిత అపరాజిత్ రెడ్డి
కల్లాకపటం తెలియని యుక్తవయస్సు పిల్లలు
జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా పోటీ పడుతూ చదువుల వైకుంఠపాలి,,,,,,,
కాలేజీ అంటే కాలింగ్ ఏజ్ ,,,,,,పిలిచే వయస్సు,,,,,!
సద్వినియోగమైతే జీవితం స్వర్గతుల్యం
స్నేహితులు సినిమాలు షికార్లు జీవితాలు అధోగతిపాలు
ఈ వయస్సులోనే జ్ఞానేంద్రియాలు చురుకుగా పనిచేస్తాయి
దూర్వ్యసనాలకు లోనైతే చదువులు గంగపాలు
చెడుస్నేహాలు కళ్ళబొల్లి కబుర్లు పక్కకుపెట్టి ,,,,,,,,,
తల్లిదండ్రులు ఎన్నెన్ని శ్రమలకోడ్చి తమను చదివిస్తున్నారో నిరంతరం మనస్సులో కదలాడాలి,,,,,,,
నిరుపేదలైనా ధనవంతులైనా ఊరికే రెండు ముద్దలు నోట్లోకి రావు,,,,,,
నీ లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా దూదిపింజల్లా ఎగిరిపోవాలి,,,,,,
సంక్లిష్ట పరిస్థితులను అతి సులువుగా చేధించే జ్ఞానం అలవరచుకోవాలి,,,,,,
విజ్ఞానిననే గర్వం కూడదు అలాగని ఆత్మాభిమానాన్ని వీడరాదు,,,,,
ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించక ఫెయిల్యూర్స్ ఎదురైతే ఆత్మన్యూనత దరిచేరనీయకూడదు,,,,,,
నీ ధ్యాస దారి ఎప్పుడూ ఉన్నత శిఖరాలను అధిరోహించడం పైనే ఉండాలి,,,,,,,,
అలాగని నేను నిరుపేదను తల్లిదండ్రులు అంతటి వ్యయాన్ని వెచ్చించలేరు అనుకుంటే బేరీజువేసుకుని అతిసులువైన ఉన్నత లక్ష్యం నిర్దేశించుకోవాలి తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ నా పరిస్థితి ఇంతే అని బేజారు పడరాదు,,,,,,,,,
ఇది ఉరుకులు పరుగుల సామాజిక నైజం నీవు పరుగెత్తితేనే ఉజ్వల భవిష్యత్తు ఇది గుర్తుంచుకో,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ