విరిసిన పూవులు అంతరంగమైన వేళ,,!!
నా చేదిరిపోయిన కలలన్నీ ఈ వేళ ఓదార్పుగా పూవులై వికసించి తలలూపుతున్నాయి,,,,,,,,
విషాదం నిండిన నా మోము ఒక్కసారిగా ఓ విరజాజి పూవై గుభాళించింది,,,,,,,,
ఆ పువ్వులలో మకరందం గ్రోలే తుమ్మెద ఒకటి నా తలచుట్టూర తిరిగి ఓ పూవుపై వాలింది,,,,,,,,
నేను రాసుకున్న విషాదకరమైన వెలిసిపోయిన గీతాలను పక్కకు నెట్టి సున్నిత మార్దవ మరులొలికే గుభాళించే ఈ పూవులపై కవనం రాయమని అంతరంగం చెబుతోంది,,,,,,,,,,,
ఈ ఉషోదయంలో నులివెచ్చని సంగీతం సూర్యరశ్మి పాడుతోంది ,,,,,,,,,,,
ఆ కిరణాలు స్పృశించగానే పూవులన్నీ తలలూపుతూ ఆహ్లాదకరంగా నర్తిస్తున్నాయి,,,,,,,,
నాలో నేను గోప్యంగా గొణుగుకుంటున్నాను మరుజన్మంటూ ఉంటే ఓ పూవై పుట్టాలిరా,,,,,,,,,,,,,,
ఈ ఆహ్లాదకరమైన పూవుల నడుమ నన్ను నేను మైమరచి ఆ అందాల సుగంధాలలో ఎప్పుడు సొమ్మసిల్లిపోయానో తెలియదు,,,,,,,,,,
పడతులు నిర్దాక్షిణ్యంగా పూవుల సజ్జలు పట్టుకుని వస్తే నా కళ్ళల్లో పాపయ్యశాస్త్రి మెదిలి రెండు కన్నీటి చుక్కలు రాల్చి నా పూవులకు వీడ్కోలు పలుకలేక కళ్ళు తడుముకుంటూ వెళ్ళివచ్చాను నా హృదయం అక్కడే వదిలేసి,,,,,,,,,,,
అపరాజిత్