విలియం స్టాన్లీ మెర్విన్(అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త)

విలియం స్టాన్లీ మెర్విన్ (సెప్టెంబర్ 30, 1927 – మార్చి 15, 2019) అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. సాహిత్యానికి సంబంధించి అమెరికాలో ఉన్న అన్ని అవార్డులను గెలుచుకున్న మెర్విన్, దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన రచనలతో, భావాలతో, భాషా ప్రయోగాలతో, జీవితంతో తన తరాన్ని, తన తర్వాతి తరాన్ని సమ్మోహన పరిచాడు.

మెర్విన్ 1927, సెప్టెంబర్ 30న న్యూయార్క్ నగరంలో జన్మించాడు. 1936లో న్యూజెర్సీకి వెళ్ళి, తన బాల్యాన్ని అక్కడ గడిపాడు. ఐదేళ్ల వయసులోనే వాళ్ల నాన్నకోసం తనకు తోచిన విధంగా పాటలు కట్టేవాడు. స్థానికంగా ఉన్న ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.

యూరప్ అంతా తిరిగి, అనువాదాలు చేయడంతోపాటు కొంతకాలం ట్యూటర్ గా పనిచేశాడు. తన సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 50కి పైగా పుస్తకాలు రాశాడు.

కవిత్వం
1952: ఏ మాస్క్ ఫర్ జానస్
1954: డ్యాన్స్ బేర్స్
1956: గ్రీన్ విత్ బీస్ట్స్
1960: ది డ్రంక్ ఇన్ ది ఫర్నేస్
1963: ది మూవింగ్ టార్గెట్.

వచనాలు
1970: ది మినర్’స్ పైల్ చిల్డ్రన్, న్యూయార్క్: ఎథీనియం (పునర్ముద్రణ 1994, న్యూయార్క్: హోల్ట్).
1977: హౌసెస్ అండ్ ట్రావెలర్స్, న్యూయార్క్: ఎథీనియం (పునర్ముద్రణ 1994, న్యూయార్క్: హోల్ట్).
2002: ది మేస్ ఆఫ్ వెండాడార్న్, నేషనల్ జియోగ్రాఫిక్ డైరెక్షన్స్ సిరీస్; వాషింగ్టన్: నేషనల్ జియోగ్రాఫిక్.
2004: ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, ఎస్సేస్, వాషింగ్టన్: షూమేకర్ & హోయార్డ్.

నాటకాలు
1956: డార్లింగ్ చైల్డ్
1957: ఫేవర్ ఐలాండ్
1961: ది గిల్డెడ్ వెస్ట్.

అనువాదాలు
1959: ది పోయెమ్ ఆఫ్ ది సిడ్
1960: ది సెటైర్స్ ఆఫ్ పెర్సియస్
1961: సమ్ స్పానిష్ బల్లాడ్స్
1962: ది లైఫ్ ఆఫ్ లాజరిల్లో డి టోర్మేస్: హిజ్ ఫోర్టున్స్ అండ్ అడ్వర్సిటైస్
1963: ది సాంగ్ అఫ్ రోలాండ్.

బహుమతులు – పురస్కారాలు
1952: యేల్ యంగర్ పోయర్స్ ప్రైజ్ ఫర్ ఏ మాస్క్ ఫర్ జానస్.
1954: కెన్యన్ రివ్యూ ఫెలోషిప్ ఇన్ పోయెట్రీ.
1956: రాక్ఫెల్లెర్ ఫెలోషిప్.
1957: నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గ్రాంట్.
1957: ప్లే రైటింగ్ బర్సరీ, ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్.

మెర్విన్ 2019, మార్చి 15న యునైటెడ్ స్టేట్స్, హవేలీలోని తన నివాసంలో మరణించాడు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *