వి. రామచంద్రరావు (1926 – 1974) భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
రామచంద్రరావు 1926, మార్చి 13న తూర్పు గోదావరి జిల్లా, లక్ష్మీ పోలవరంలో జన్మించాడు. కాకినాడ, చెన్నైలలో చదవుకున్నాడు.
తాపీ చాణక్య సూచనమేరకు సినీరంగానికి వచ్చిన రామచంద్రరావు రోజులు మారాయి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఘట్టమనేని కృష్ణ కథానాయకుడిగా నటించిన మరపురాని కథ చిత్రంతో దర్శకుడిగా మారాడు. అప్పటినుండి కృష్ణతో అనుబంధం ఏర్పడింది. తను దర్శకత్వం వహించిన 17 చిత్రాలలో 11 చిత్రాలు కృష్ణ హీరోగా తీసినవి. వీరిద్దరి కలయికలో వచ్చిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా భారీ విజయాన్ని సాధించింది. రామచంద్రరావు దర్శకత్వంలో ఎడారిలో తప్పిపోయిన బాలుని కథతో వచ్చిన పాపం పసివాడు చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక విలక్షణ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హెలికాప్టరు ద్వారా కరపత్రాలను పంచారు. రామచంద్రరావు నిర్మించిన భద్రం కొడుకో చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.
దర్శకుడిగా:
కర్పూర హారతి (1969)
ఆస్తులు అంతస్తులు (1969)
అన్నదమ్ములు. (1969)
అఖండుడు (1970)
మా మంచి అక్కయ్య (1970)
పగ బట్టిన పడుచు (1971)
పెన్నుం పొన్నుం (1974)
అల్లూరి సీతారామరాజు చిత్రీకరణ మధ్యలోనే 1974, ఫిబ్రవరి 14న రాయవేలు ఆసుపత్రిలో రామచంద్రారావు (47) గుండెపోటుతో మరణించాడు. ఆయన చివరి కోరిక మేరకు మిగతా చిత్రాన్ని పూర్తిచేసిన కృష్ణ, చిత్ర టైటిల్స్ లో దర్శకుడిగా రామచంద్రారావు పేరునే వేశాడు.
మాధవి కాళ్ల
సేకరణ