నీవు బ్రతికితే వీరునివై ధీరునివై చెలరేగిపో
ఊపిరి వున్నంతకాలం చైతన్యం ప్రజ్వలించగా
జీవితంలో జ్వలించే ఇంధనం నింపుకుని కాంతిపుంజమై కారుమబ్బులను చీల్చుకుని ఉరుములు మెరుపులతో విరుచుకుపడు ,,,,,,,,,,,,
నిప్పు కణికలనే ముద్దాడు,,,,,,,
మనస్సు శరీరం ఉక్కుపిడుగులా శత్రువును తుంటలు తుంటలు చేయాలి,,,,,,,,
యాదిపెట్టుకో నీవంటేనే ప్రత్యర్ధులు హడలెత్తిపోయేలా కండబలం గుండెల నిండా నింపుకుని విరుచుకుపడితే అవతలి వాడికి భయంతో ఒళ్ళు గగుర్పొడవాలి,,,,,,,,
జీవిత పర్యంతం గుర్తుండిపోయేలా ప్రత్యర్థి గుండెలు గుబగుబలాడాలి,,,,,,
ఉజ్వల ఫిరంగివై కత్తులు తుపాకులు లేకున్నా గుణపంలా చెలరేగుతూ నీవున్నంతసేపు నిప్పుల వాన కురిపించాలి,,,,,,,
ఏకాగ్ర చిత్తంతో ఎటుచూసినా నీవై భయంకర బ్రహ్మాస్త్రానివై సూటిగా నీ లక్ష్యం అవలీలగా ఛేదించి ఒక్కమాటుగా చరిత్రలో ఎర్రెర్రని అక్షరాలలో ఘనంగా నీ చరిత్ర లిఖించబడాలి,,,,,,,,,
వజ్రాలవాన జలజలా రాలగా వీరునివై ధీరునివై రణధీరునివై నీ జైత్రయాత్ర నీ ఊపిర్ల సాక్షీభూతంగా యావత్తు ప్రపంచమంతా నభూతో నభవిష్యత్ అని కొనియాడాలి,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట