పనులు చేసి చేసి తనువలసి సొలసి
పండుటాకు రాలి పడిన యటుల
ముసలి తల్లి దండ్రి పూర్తిభారమునంత
సంతు జూచుననుచు సంతసించు
పెంచి,విద్య నేర్పి,ప్రేమనుపంచుచూ
ముసలి తల్లి, దండ్రి మురిసినారు
మూఢులై కొమరులు బుద్ధిహీనులగుచు
చీదరించుకొనుట చిత్రమాయె!
వృద్ధులనుభవాలు వృద్ధిసోపానాలు
ఆచరించు వారికధిక సుఖము
పెద్దలున్న యింట ప్రేమబంధాలుండు
చింతలేక యుండు చిన్నవారు
తల్లి దండ్రి సేవ తనయులు జేసిన
ధన్యజీవి యగును ధరణియందు
ముసలివారి వళ్ళ ముప్పు కలుగునని
వెడలగొట్టు సుతుడు వెర్రివాడు !
......... కోట.